తగ్ లైఫ్ ట్రైలర్ చూస్తే, ఇది తండ్రి, తనయుల సమరం లాగే కనిపిస్తున్నా, మణిరత్నం కథలు అంత సింపుల్ గా ఉండవు. పైగా గతంలో కుటుంబం అంతా పగలు ప్రతీకారాలతో నవాబ్ తీసాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రకాశ్ రాజ్, జయసుధ, శింబు, సేతుపతి, అరవింద్ స్వామి, ఇలా భారీ స్టార్ కాస్ట్ నటించింది. అయినా సరే, మణిరత్నం పెద్దగా మెప్పించలేకపోయాడు. తగ్ లైఫ్ కు కమల్ కథను అందించాడు.

మరణం లేని వాడు అనే కాన్సెప్ట్ తో స్టోరీ రెడీ చేసినట్లు సమాచారం. అయితే ఇందులో తండ్రి, తనయుడి మధ్యే సంఘర్షణ అంతా కనిపించబోతోంది. అయితే అది ఎందుకు పవర్ కోసమా, స్థానం కోసమా, మరో యాంగిల్ ఉందా అనేది తెలియాలి అంటే జూన్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అదే రోజు ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది.నాయకుడు తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలసి చేస్తోన్న ఈ చిత్రం పై, తమిళ సినీ పరిశ్రమ భారీ అంచనాలు పెట్టుకుంది. పైగా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తర్వాత తెరకెక్కించిన చిత్రం ఇది. మరోసారి మ్యాజిక్ రిపీట్ అయితే మాత్రం, కోలీవుడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నట్లే లెక్క.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!