
మీకు గుర్తుందా కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో, నిప్పు అనే టైటిల్ కోసం ఇటు గుణశేఖర్, అటు కళ్యాణ్ రామ్, పెద్ద ఎత్తున ఫైట్ కు దిగారు. ఆ తర్వాత ఆ టైటిల్ తో గుణశేఖర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యాణ్ రామ్ మనసు మార్చుకుని కత్తి అనే టైటిల్ తో అడ్జెస్ట్ అయ్యాడు.
అఫ్ కోర్స్ ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అది వేరే విషయం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సేమ్ స్టోరీ ఇప్పుడు కోలీవుడ్ లో రిపీటైంది. కాకపోతే ఇద్దరు ఒకే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు శివకార్తికేయన్, విజయ్ ఆంటొని.అమరన్ తర్వాత శివకార్తికేయన్ తన కెరీర్ లో 25వ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు ఆకాశమే నీ హద్దురా దర్శకురాలు సుధ కొంగర తెరకెక్కించింది.శ్రీలీల హీరోయిన్, జయం రవి విలన్ రోల్స్ చేసారు. కొద్ది గంటల క్రితమే సినిమాకు టైటిల్ ను రివీల్ చేసారు. మూవీకి పరాశక్తి అనే పేరు పెట్టారు. బాగుంది.

అయితే అంతకముందే విజయ్ ఆంటోని సేమ్ టైటిల్ తో పోస్టర్ ను విడుదల చేసాడు.అతను నటించే చిత్రానికి తమిళంలో శక్తి తిరుమగన్ అని పేరు పెట్టాడు. కాని తెలుగు సహా మిగితా భాషల్లో పరాశక్తి టైటిల్ ఫిక్స్ చేసేసాడు. పోస్టర్స్ కూడా రిలీజ్ చేసాడు. అదెలా అంటే, పరాశక్తి టైటిల్ ను గత ఏడాది జులైలోనే రిజిస్టర్ చేసానంటూ లెటర్ హెడ్ ను విడుదల చేసాడు. స్టోరీలో మరో ట్విస్ట్ ఉందండోయ్, అదేంటి అంటే ఈ రెండు సినిమాలు .. ఇటు శివకార్తికేయన్ కు, అటు విజయ్ ఆంటొనికి కెరీర్ లో 25వ చిత్రం. కాని ఇలా జరిగిపోయింది.

