హైదరాబాద్‌కు చెందిన లార్డ్స్ ఇన్స్టి ట్యూట్‌ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ( LIET) ఇదే ఏడాది ఫిబ్రవరిలో మలేషియాలోని గోంబాక్ క్యాంపస్‌లో ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ మలేషియా ( IIUM)తో అవగాహన ఒప్పందం ( MOU) కుదుర్చుకుంది.  ఈ ఒప్పందంతో అంతర్జాతీయ విద్యా మార్పిడితో పాటు పరిశోధనాభివృద్ధి కోసం గొప్ప అడుగు పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖ ప్రభుత్వ విశ్వవిద్యాలయమైన ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ మలేషియా   క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో అగ్రశ్రేణి సంస్థలలో ఒకటిగా నిలిచింది.ఇందులో దాదాపు 40 వేల మంది విద్యార్థులు, విద్యను అభ్యశించడంతో పాటు, పరిశోధనా నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో కలగి ఉన్నారు.

ఈ దశలో ఉమ్మడి పరిశోధన, సహకార ప్రచురణలు, టీచర్స్ షఫ్లింగ్  తో పాటు కల్చరల్ యాక్టివిటీస్‌ ను పెంపొందించేందుకు ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడనుంది. ఈ డీల్ తో ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఇండస్ట్రీ అండ్ ఎడ్యూకేషన్ రిలేషన్స్ ను గొప్పగా మార్పులు తీసుకురానుంది. అదే విధంగా బలోపేతం కూడా అవుతుంది. గత రెండేళ్లలో 40మంది లార్డ్స్ కాలేజీ విద్యార్థులు క్యాంపస్‌లో ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ మలేషియా( IIUM) ద్వారా ఇంటర్నేషనల్ ఇంటర్న్ షిప్స్ కోర్స్ కంప్లీట్ చేసారు.

ఈ విధంగా ఒప్పందం విద్యార్థుల భవితకు ఎంతగా దోహదపడుతుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ ఒప్పందం పై లార్డ్స్ ఇన్స్టి ట్యూట్‌ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ( LIET) హైదరాబాద్ వైస్ చైర్మన్ శ్రీ సయ్యద్ తౌసీఫ్ అహ్మద్, మలేషియాలోని ( IIUM)  డిప్యూటీ డైరెక్టర్ శ్రీ అహ్మద్ ఫారిస్బిన్ ఇస్మాయిల్ అధికారికంగా సంతకాలు చేసారు. ఈ రెండు విద్యాసంస్థలు నిరంతర విద్యాసహకారంతో విద్యార్థుల బంగరు భవితకు బాటలు వేయనున్నాయని ఈ సందర్భంగా డైరెక్టర్స్ పునరుద్ఘాటించారు.

ఇది కూడా చదవండి

error: Content is protected !!