
వెంకటేష్ తో త్రివిక్రమ్ మూవీ గురించి, టోటల్ టాలీవుడ్ డిస్కస్ చేస్తోంది. అల్లుఅర్జున్ తో తెరకెక్కించాల్సిన మైథాలజీకి, ఇంకా టైమ్ ఉండటంతో, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న వెంకీ మూవీని, త్రివిక్రమ్ ఈలోపు కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాడు అనేది, ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోన్న మాట. నిజానికి త్రివిక్రమ్, వెంకీ ఫిల్మ్ అనేది ఎప్పుడో ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. కాని ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లిస్ట్ లో పడిపోతూ వచ్చింది.
కొన్ని సార్లు అయితే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని వార్తలు వినిపించినా, త్రివిక్రమ్, వెంకీ మారుమాట్లాడలేదు. కాని ఎప్పుడైతే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ గా నిలిచిందో, 300కోట్లకు పైగా కొల్లగొట్టిందో అప్పటి నుంచి టాలీవుడ్ లో వెంకీ క్రేజ్, నెక్ట్స్ లెవల్ కు వెళ్లింది. అంటే వెంకీ పోటెన్షియాలిటీ 300 కోట్లు ఉంది. అదే త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ రంగంలోకి దిగితే ఈ వసూళ్లు ఇంకా పెరుగుతాయి. ఇక్కడే త్రివిక్రమ్ లెక్కలు వేయడం ప్రారంభించాడు. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కు ముందు వెంకీ మార్కెట్ డౌన్ లో ఉంది. ఇప్పుడు విక్టరీ మార్కెట్ నెక్ట్స్ లెవల్లో ఉంది. ఈ సమయంలో కనుక తనతో చిత్రం తీస్తే, తన గ్రాఫ్ మరింత పెరుగుతుందని, త్రివిక్రమ్, వెంకటేష్ మూవీ రేంజ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, ఇన్నాళ్లు మాటల మాంత్రికుడు వెయిట్ చేస్తూ వచ్చాడు.