
గత వారం, పది రోజులుగా, టాలీవుడ్ నిండా ఇటు వెంకటేష్ కొత్త చిత్రంపై, అలాగే వినాయక్ అనారోగ్యంపై రూమర్లు షికార్లు చేసాయి. అయితే అనుకోకుండా ఈ రెండు రూమర్స్ కు, ఇప్పుడు చెక్ పడే కాంబినేషన్ సెట్ అయింది అనేది ప్రైడ్ న్యూస్ కు అందుతోన్న సమాచారం. అదేంటి అంటే లక్ష్మీ కాంబినేషన్ రిపీట్.
సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత , వెంకటేష్ కొత్త సినిమా ఏంటి అనేది, కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. సురేందర్ రెడ్డి మేకింగ్ లో వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ చేయనున్నారని ప్రచారం మొదలైంది. కాని వెంకటేష్ ఇటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించడం లేదని, అదే విధంగా ఎలాంటి మల్టీస్టారర్ కు డేట్స్ ఇవ్వలేదని క్లారిటీ వచ్చేసింది. మరి వెంకటేష్ ఎవరితో మూవీ చేస్తున్నాడు అంటే ఇంకెవరు, వినాయక్ తో అంటోంది టాలీవుడ్.
వినాయక్ కొంత కాలంగా సినిమాల మేకింగ్ కు దూరంగా ఉంటున్నాడు. అదే సమయంలో తరచూ అనారోగ్య సమస్యలు తెరపైకి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అయితే తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలు షికార్లు చేసాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని వినాయక్ సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఇటీవల దిల్ రాజు ఇంకా మరికొంతమంది దర్శకులు వినాయక్ ను ప్రత్యేకంగా కలసి వచ్చారు. అప్పుడు కూడా వినాయక్ చాలా ఉత్సాహంగా కనిపించాడు.
ఇప్పుడు వెంకటేష్ తో వినాయక్ స్టోరీ డిస్కస్ చేస్తున్నాడని, లక్ష్మీ కాంబినేషన్ లో మరోసారి పవర్ ఫుల్ మూవీ తీస్తానంటున్నాడని సమాచారం. అదే నిజమైతే మాత్రం వెంకీ ఫ్యాన్స్ కు పండగే.