
లక్కీ భాస్కర్ ఏంటి, మళ్లీ అందులో ఓరిజినల్ ఏంటి, వెంకీ అట్లూరి దాచింది ఏంటి అనేదే కదా మీ డౌట్. ఈ విషయాన్ని సాక్షాత్తు వెంకీ అట్లూరీనే రివీల్ చేసాడు. ఇంత కాలం వెంకీ, తన చిత్రాలను మొత్తంగా తమిళ, మలయాళ హీరోలతోనే చేస్తున్నాం అనుకుంటున్నాం.. కాని పాపం ఈ డైరెక్టర్ తాను ఏ కథ రాసిన ముందుగా నాగ చైతన్యకు వినిపిస్తూ వస్తున్నాడు. చైకి వెంకీ అట్లూరి రాసిన స్టోరీస్ నచ్చుతున్నాయి కాని డేట్స్ ఉండటం లేదు. ఈ లెక్కలో నాగ చైతన్య లక్కీ భాస్కర్, సర్ , ఇప్పుడు సూర్యతో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న చిత్రాలను మిస్ చేసుకున్నట్లే కదా..
ఒక లక్కీ భాస్కర్,ఒక సర్ సినిమాలు నాగ చైతన్యకు పడి ఉండే, అతని ఇమేజ్ మారిపోయి ఉండేది. ముఖ్యంగా లక్కీ భాస్కర్ సినిమా స్టోరీ చైకి బాగా సూట్ అవుతుంది. ఇది బంపర్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లు అయింది. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి అంటారు. అలా నాగ చైతన్య కోసం వెంకీ అట్లూరి ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసి, ఫ్యూచర్ లో సినిమా తీస్తే, ఈ లోటు తీరిపోతుంది. తండేల్ తో చందూ మొండేటి చేసింది అదే.. ఈ చిత్రంతో చైకి తొలిసారి వంద కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం విరూపాక్ష మేకర్ తో కొత్త చిత్రం చేస్తున్నాడు చై. ఈ చిత్రం తర్వాత, తన కెరీర్ లో 25వ చిత్రం చేయబోతున్నాడు. ఇందుకు మజిలీ దర్శకుడు శివ నిర్వాణ తో కథ చర్చలు జరుపుతున్నాడని సమాచారం.
ఇది కూడా చదవండి