శ్రీమంతుడు మహేష్ బాబు, అపరిచితుడు విక్రమ్, ఇక దర్శకధీరుడు అంటే రాజమౌళి. అవును అయితే ఏంటి… అంటే ఒకే సినిమాలో శ్రీమంతుడు, అపరిచితుడు, దర్శకధీరుడు కనిపిస్తే ఎలా ఉంటుంది. వావ్ ఇదేదో సూపర్ ఫిల్మ్ అవ్వబోతోంది అనిపిస్తోంది కదా. రాజమౌళి ప్లాన్ కూడా అదే.. మహేష్ మూవీలో విక్రమ్ కూడా నటించబోతున్నాడట. సో దట్ ఈ చిత్రం ఇప్పుడు ఇండియాలోనే అతి పెద్ద మల్టీస్టారర్ గా మారబోతోంది.

అదెలా అంటే టాలీవుడ్ నుంచి మహేష్, మాలీవుడ్ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నుంచి దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా, ఇలా బాహుబలి తర్వాత రాజమౌళి అతి పెద్ద మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న అవుతుంది. ప్రస్తుతం మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు రాజమౌళి. విక్రమ్ త్వరలోనే సెట్ లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే వీర ధీర శూర అనే చిత్రంతో మెప్పించాడు విక్రమ్. ప్రస్తుతం మహావీరుడు డైరెక్టర్ తో మూవీ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి
error: Content is protected !!