విశాల్ మళ్లీ ప్రేమలో పడినట్లు, పెళ్లికి రెడీ అవుతున్నట్లు, కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తోంది. అదే ఇప్పుడు అదే నిజమైంది. ఈ విషయాన్ని ధన్సిక అఫీసియల్ గా ప్రకటించింది. ఆగస్ట్ 29న విశాల్, ధన్సిక పెళ్లి పీటలెక్కబోతున్నారు. యోగిడా అనే తమిళ మూవీ ఆడియో లాంఛ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసాడు విశాల్. ఈ సందర్భంగా స్వయంగా ధన్సిక, విశాల్ తో మ్యారేజ్ డేట్ లీక్ చేసేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో సంచలనం సృష్టించిన కబాలి చిత్రంలో, ఆయనకు కూతురిగా నటించిన ధన్సికతో విశాల్ కొంత కాలం ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. ఇప్పుడు నడిగర్ సంఘం బిల్డింగ్ సిద్ధం అవ్వడంతో, త్వరలో ధన్సికతో ఎంగేజ్ మెంట్ తంతు పూర్తి చేసి, ఆ తర్వాత నడిగర్ సంఘం బిల్డింగ్ లోనే ఘనంగా వివాహమహోత్సవం జరుపనున్నాడు. ముందు సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ధన్సిక మెడలో విశాల్ మూడు ముళ్లు వేయడం ఖాయం వార్తలు వినిపించాయి.. కాని ఆ డేట్ ఆగస్ట్ కు మారింది.

ఒకప్పుడు తమిళంలో బిజీగా కనిపించిన ధన్సిక, గత ఏడాది తెలుగులో షికారు, అంతిమ తీర్పు, దక్షిణ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే వీరిద్దరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు.. ఎలా కలిశారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. విశాల్ గతంలో చాలా సార్లు ప్రేమలో పడ్డాడు.

ఒకసార వరలక్ష్మితో పీకల్లోతు ప్రేమ వ్యవహారం నడిపాడు. కాని శరత్ కుమార్ వీరి లవ్ స్టోరీకి అబ్జెక్షన్ చెప్పాడు.  ఆ తర్వాత అభినయ అనే మరో కథానాయిక మెడలో మూడు ముళ్లు వేస్తాడు అన్నారు. కాని ఇప్పుడు మాత్రం ధన్సిక పేరు తెరపైకి వచ్చింది. పెళ్లి డేట్ కూడా వచ్చేసింది. విశాల్ ప్రస్తుతం తానే దర్శకుడిగా మరి డిటెక్టివ్ అనే చిత్రానికి సీక్వెల్ తీసుకొచ్చే పనిలో పడ్డాడు.

ఇవి కూడా చదవండి1

  1. ↩︎

error: Content is protected !!