టూ వీలర్ కొనుగోలు చేసిన ప్రతీ వాహనదారుడు, హెల్మెట్ ధరించాల్సిందే. ట్రాఫిక్ పోలీసులకు, చలాన్లకు భయపడి కాదు, తలకు , మెదడుకు రక్షణ. కాని కొందరు వాహనదారులు వీటికంటే కూడా, కేవలం జుట్టు ఊడిపోతుందని హెల్మెట్ ధరించడం లేదు. అయితే శిరస్త్రాణం ధరించడం వెంట్రుకలు ఊడిపోతాయి అనేది అపోహ మాత్రమే అంటున్నారు డెర్మటాలజిస్టులు.

అపోహతో, తెలిసీ తెలియని వాళ్లు చెప్పిన మాటలతో హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు అంటూ హెచ్చరిస్తున్నారు. గత ఏడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 842 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా, ఇందులో 465 మంది టూ వీలర్స్ ను నడిపారే .. అందులోనూ తలకు గాయాలై చనిపోయారు. హెల్మెట్ ధరించడం వల్ల తలకు తీవ్రమైన గాయల నుంచి రక్షణ కల్పించవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినా అసలు హెల్మెట్ పెట్టుకోవడానికి, జుట్టు ఊడటానికి సంబంధమే లేదని,

వెంట్రుకలు ఊడటానికి కొన్ని అనారోగ్య సమస్యలు లేదా జన్యుపరమైన ఇబ్బందులు దోహదం చేస్తాయని చర్మ వ్యాధుల నిపుణులు చెప్పుకొస్తున్నారు. హెల్మెట్ ధరించినప్పటికీ, మెడ కింద బెల్టు కూడా పర్ఫెక్ట్ గా పెట్టుకోవాల్సిందే. లేదా ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ పక్కకు పడిపోయే పోతుంది. గాయం తీవ్రత పెరుగుతుంది. పైగా అవి ఇవి కాకుండా ఐఎస్ ఐ మార్క్ ఉన్న హెల్మెట్ ధరించడం ఉత్తమం.

హెల్మెట్ కోనుగోలు చేయాలనుకుంటున్నారా..

ముందుగా ఐఎస్ ఐ మార్క్ మస్ట్.

రెండు మీ తల సైజుకు తగ్గట్లు నాణ్యమైనది ఎంపిక చేసుకోండి.

కూల్ ఫైబర్ ఉన్న హెల్మెట్లు, గాలి లోపలికి వెళ్లే వాటిని ఎంపిక చేసుకోండి.

ఫలితంగా చెమట సమస్య ఉండదు.

ఇక జుట్టు ఊడటం తో ఇబ్బంది పడుతున్న వారు మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోండి. లేదా చుండ్రు, చర్మ వ్యాధులు ఏవైనా ఉన్నాయో తెల్సుకుని వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోండి.

ఇవి కూడా చదవండి..
error: Content is protected !!