
ఏ దేశమైనా, ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అంత పెద్ద అగ్రరాజ్యానికే తిప్పలు తప్పడం లేదు. అలాంటి ఫిన్లాండ్ వరుసగా సంతోషకరమైన దేశాల్లో టాప్ లో నిలుస్తూ వస్తోంది. ఏదో ఒకటో రెండు సార్లు అనుకుంటే అనుకోవచ్చు… 8 ఏళ్లుగా ఇదే తంతు. నెంబర్ టూ నుంచి పొజీషన్స్ మారుతుండవచ్చు, కాని నెంబర్ వన్ స్థానం మాత్రం ఫిన్లాండ్ దే.. అక్కడి ప్రజలు ఎందుకంత సంతోషంగా జీవిస్తున్నారు.. అందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది.. ఈ విషయాలు పరిశీలిస్తే చాలా ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.
ఉద్యోగులకు పని గంటలు తక్కువట అలాగే కుటుంబాలతో గడిపేందుకు అధిక సమయం వెచ్చిస్తారట. అడిగినప్పుడు సెలవలు. వర్క్ ను, పర్సనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవడం, లాంటి అక్కడి కంపెనీలు ప్రొత్సహిస్తాయట. దాంతో ఎంప్లాయిస్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడుపుతున్నారు. వారానికి కేవలం 40 గంటలు మాత్రమే పని, అందుకే వర్క్ విషయంలో కూడా అద్భుతాలు చూస్తోంది ఫిన్లాండ్
స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు, ఉచిత విద్య. పిల్లలు పుట్టకముందు నుంచే, వారి భవిష్యత్ గురించి, కట్టే ఫీజుల గురించి ఆ దేశ పౌరులు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. పైగా ప్రపంచంలోనే అత్యుత్తమైన విద్యావ్యవస్థ ఫిన్లాండ్ సొంతం. అందరికి సమానమైన ఆరోగ్య వ్యవస్థ కలిగి ఉంది.
ఇక అవినీతికి స్థానం లేదు. ప్రభుత్వం పైనే అపారమైన నమ్మకం. లింగ వివక్షకు ఆస్కారమే లేదు. అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా స్త్రీలకు అవకాశాలు అందిస్తోంది ఫిన్లాండ్.
ఇక్కడి ప్రజలు ఆవిరితో కూడిన స్నానాలు చేస్తారు. శరీరానికి విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది. పైగా ఇలాంటి ఆవిరి స్నానాల వల్ల కొత్త పరిచయాలు పెరుగుతాయని వారు బలంగా విశ్వసిస్తారు. అందుకే ఈ దేశంలో దాదాపు 30 లక్షలకు పైగా ఆవిరి స్నాన గదులు ఉన్నాయట. పైగా కోవిడ్ తర్వాత ఈ దేశ ప్రజల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, మద్దతుగా నిలవడం, పెరిగింది అనేది ఒక నివేదిక చెప్పుకొచ్చింది.
అందమైన ప్రకృతికి ఫిన్లాండ్ పెట్టింది పేరు. స్వచ్చమైన గాలి, నీరు, అడవులు,జలపాతాలు, ఇలాంటి ప్రదేశాల్లో ప్రజలు పర్యటించినప్పుడు ఎలాంటి ఒత్తిడైనా చిత్తు కావాల్సిందే. ఇక కావాల్సినన్ని పార్కులు సేద తీరేందుకు ఉపయోగపడుతున్నాయి. తాజా ఆహారానికి అధిక ప్రాధ్యానతను ఇస్తారు. ఖర్చు గురించి ఆలోచించకుండా, మంచి ఫుడ్ తీసుకుంటారు.