
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు చాలా డ్రీమ్స్ ఉంటాయి. పవర్ స్టార్ కాజల్ జోడి మరోసారి రిపీటైతే బాగుంటుందని, అలాగే పవన్, పూజా హెగ్డే కాంబో కుదరాలని, ఏవేవో డ్రీమ్స్ వేస్తుంటారు. కాని పవర్ స్టార్ సంగతి తెల్సిందే. తన దారి తనది, తాను షూటింగ్ చేసే సమయంలో ఏ హీరోయిన్ డేట్స్ అందుబాటులో ఉంటే వారితో మూవీస్ చేస్తుంటాడు. ఇప్పుడు ఉస్తాద్ లోకి రాశీఖన్నా అలాగే అడుగు పెట్టింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్పాట్ లో కనిపించిన భాగ్యశ్రీ బోర్సే,
పవన్ తో దిగిన ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇద్దరి జోడి అదిరిపోయిందని, వీరిద్దరు కలసి సినిమా చేస్తే అదిరిపోతుందని పవన్ ఫ్యాన్స్ కొత్త డిమాండ్ ఎత్తుకున్నారు. ఈ డ్రీమ్ హరీష్ మాత్రమే ఫుల్ ఫిల్ చేయగలడు. ఉస్తాద్ లో భాగ్యశ్రీతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ డ్రీమ్ ఫుల్ ఫిల్ అవుతుంది. ఎందుకంటే భాగ్యశ్రీ ని టాలీవుడ్ కు తీసుకొచ్చిందే హరీష్. మిస్టర్ బచ్చన్ మూవీతో భాగ్యశ్రీ టాలీవుడ్ కు పరిచయం అయిన సంగతి తెల్సిందే.
ఇది కూడా చదవండి