
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడు అల్లు అర్జున్, కొన్ని సార్లు చేసే పనులు చాలా విచిత్రంగాను, విడ్డూరంగాను ఉంటాయి. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కోర్ట్ మూవీ టీమ్ ను, ఇప్పుడు కలవడం, వారిని అభినందించడం, సెల్ఫీలు అందించడం, సినిమా మార్చిలో రిలీజైంది. పైగా చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుని, బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది కోర్ట్ మూవీ. ఓటీటీలో రిలీజ్ తర్వాత పాన్ ఇండియా అప్లాజ్ కూడా తెచ్చుకుంది.
కాని అల్లు అర్జున్ కు ఇప్పుడు ఈ టీమ్ ను కలిసేందుకు టైమ్ కుదిరినట్లుంది. నిర్మాత నాని లేకుండానే హీరో, హీరోయిన్, మిగితా స్టార్ కాస్ట్ ను పిలిచి అభినందించాడు. ఇదే సినిమా థియేటర్స్లో ఉన్నప్పుడు, అల్లు అర్జున్ అభినందించే కార్యక్రమం పెట్టుకుంటే, ఐకాన్ అభిమానులు మరికొద్ది మంది వెళ్లి, కోర్ట్ కు కలెక్షన్స్ పెంచేవాళ్లు, నానికి లాభాలు పెరిగేవి.
ఇప్పుడు సడన్ గా కోర్ట్ టీమ్ ను ప్రశంసించాలని అల్లు అర్జున్ కు ఎందుకు అనిపించిందో.. ఏదైనా ప్రశంసించడం, అభినందించడం, ప్రోత్సహించడంలో, ప్రస్తుతం బన్ని అందరికంటే ముందు ఉంటున్నాడు. ఇది మంచి విషయం. ఆల్రెడీ బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్న ధురంధర్ పై రివ్యూ పెట్టాడు అల్లు అర్జున్. ఇక పుష్ప- 2 తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాడని సమాచారం.
కోర్ట్ తర్వాత మళ్లీ ఏ చిత్రాన్ని పిలిచి ఇలా అభినందిస్తాడో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
