
వరుసగా షాక్స్ ఇస్తోన్న నయన్
ముందు ట్యాగ్ వద్దంటూ హడావుడి
ఇప్పుడు కొత్త సినిమా ఓపెనింగ్ లో సందడి
ఏళ్లుగా నయనతార అంటే, దర్శకులైనా, నిర్మాతలైనా, ఒక్కటే కంప్లైంట్ చేసేవారు. అదేంటి అంటే సినిమాలో నటిస్తుంది. కాని సినిమా ప్రమోషన్ అంటే మాత్రం నో చెబుతుంది. దాంతో అగ్రిమెంట్ అంతవరకే కుదిరేది. కాని ఇప్పుడు నయన్ ఒక సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొనడం, తమిళనాట సంచలనం సృష్టిస్తోంది.
గతంలో డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన అమ్మోరు తల్లి సినిమాకు సంబంధించిన సీక్వెల్ మూవీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సినిమా ఓపెనింగ్ కు , ఇదే సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్న నయనతార హాజరు కావడం , చూసేవారు.. వారు కళ్లను నమ్మలేకపోయారు. తాము చూస్తున్నది నయనతారనేనా అనుకున్నారు.
ఇన్నేళ్ల కెరీర్ లో నయనతార ఒక సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఇదే మొదటిసారి.అంతే కాదు కొద్ది రోజుల క్రితం, తన పేరుకు ముందు లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ వద్దూ అంటూ లెటర్ రాసుకొచ్చింది నయన్. ఇన్నేళ్లలో లేనిది, ఇప్పటికిప్పుడు నయనతారలో మార్పు రావడం , కొత్తగా కనిపిస్తుడం వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు కోలీవుడ్ కు అర్ధం కాకుండా ఉంది. ధనుష్ తో పోట్లాడిన తర్వాత, జరగాల్సినంత డ్యామేజీ జరిగిన తర్వాత, తన ఇమేజ్ తగ్గిందని నయనతార భావిస్తోందని సమాచారం. అందుకే తన ఇమేజ్ ను కాపాడుకుంటూ, నయన్ అంటే తిరుగులేని స్టార్ అని నేమ్ కంటిన్యూ అయ్యేందుకు ఇలాంటి పనులన్ని చేస్తోందని కోలీవుడ్ చెప్పుకొస్తోంది.