చిరుత యావరేజ్ అట

చరణ్ కోసమే రాజమౌళి దగ్గరికి వెళ్లారట

నష్టాలు వస్తాయని తెల్సినా సినిమాను నిర్మించారట

ఎక్కడి చిరుతు, ఎప్పుడు మగధీర, ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు అల్లు అరవింద్ గారు, అసలే మెగా వర్సెస్ అల్లు వార్ పీక్స్ లో ఉంది. ఈ దశలో ఇవన్ని ఎందుకు, దూరాన్ని మరింత పెంచడం ఎందుకు, ముఖ్యంగా అల్లు అరవింద్ చరణ్ ను టార్గెట్ చేస్తున్నాడని, సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. హిస్టరీలో జరిగింది ఒకటి అయితే, అల్లు అరవింద్ చెబుతున్నది మరొకటి అని, మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు జరిగింది ఇది అంటూ, తమకు తెల్సిన విషయాలను, ఓల్డ్ ఇంటర్వ్యూస్ లో బైట్స్ ను సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. ఏదో ఒక సారి అయితే అనుకోవచ్చు. తండేల్ ప్రమోషన్స్ మొత్తంలో కూడా, చరణ్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు అల్లు అరవింద్. అది ఆయన కావాలని చేస్తున్నారా, అనుకోకుండా జరుగుతుందా అనేది, ఎవరికి అర్ధం కాకుండా ఉంది.

ఇదే విషయాన్ని మళ్లీ మీడియా ప్రశ్నిస్తే, నో కామెంట్ అంటూ దాటేస్తున్నారు అల్లు అరవింద్.

ముందు సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయింది అనే అర్ధం వచ్చే విధంగా దిల్ రాజు ముందే మాట్లాడారు. ఇక్కడే మొదట అగ్గి రాజుకుంది. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో, రామ్ చరణ్ మొదటి చిత్రం చిరుత యావరేజ్ అన్నారు. ఆ తర్వాత చిరుత యావరేజ్ గా నిలవడంతో అతనికి ఎలాగైనా సూపర్ హిట్ ఇవ్వాలని తానే  స్వయంగా రాజమౌళి దగ్గరికి వెళ్లినట్లు తెలిపారు. నష్టాలు వస్తాయని తెల్సినా, వ్యయం పెరిగిపోతున్నా తాను మాత్రం చరణ్ పై ప్రేమతోనే మగధీర నిర్మించినట్లు చెప్పుకొచ్చారు.

అయితే అల్లు అరవింద్ చెబుతున్నవి అన్ని అబద్దాలే అంటూ మెగా ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంటోంది. హిస్టరీని మార్చి చెప్పాల్సిన అవసరం ఇప్పుడెందుకు వచ్చింది అరవింద్ గారు అంటూ మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మాటి మాటికి చరణ్ కు టార్గెట్ చేయడం వెనుక , మెగా ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చవవండి

error: Content is protected !!