
ఈ టైటిల్ చూసి తెలుగు సినీ పరిశ్రమకు ఏమైంది అని ఆలోచనలో పడిపోకండి. ఎందుకంటే ఈ స్టోరీ చదివిన తర్వాత మీరు కూడా మా టైటిల్ కు జిందాబాద్ కొడతారు. ఇక అసలు కథలోకి వెళితే.. ఏ సినిమాను అయినా ఘనంగా ప్రారంభించడం, మెగాస్టార్ , రెబల్ స్టార్ తో క్లాప్ కొట్టించడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం,
సినీ పరిశ్రమలో సెంటిమెంట్ గా వస్తోంది. కాస్త పెద్ద సినిమా అయితే పరిశ్రమ మొత్తాన్ని పిలిచి పండుగలా మూవీ ఓపెనింగ్స్ నిర్వహించిన నిర్మాతలను కూడా చూశాం. కాని ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో విచిత్రమైన ట్రెండ్ ప్రారంభమైంది. సినిమాను ప్రారంభిస్తారు కాని చెప్పరు. సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు కాని రివీల్ చేయరు. షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తారు కాని అప్ డేట్ చేయరు. అసలు ఇదేం ట్రెండ్.
దీని వెనకు దర్శకనిర్మాతల ఆలోచన ఏంటి అనేది అర్ధం కాకుండా ఉంది. మహేష్ తో రాజమౌళి సినిమాను ప్రారంభించాడు. చెప్పాడా చెప్పలేదు. పైగా ఒడిశాలో షూటింగ్ పెట్టుకున్నాడు. ఎవరో లీక్ చేసారు కాబట్టి ఈ విషయం బయటకి వచ్చింది. ఇప్పుడు ఈ ట్రెండ్ లో నాగార్జునతో పూరి సినిమాను తెరకెక్కిస్తున్నాడట.
హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతోందట. ఇక అఖిల్ కొత్త చిత్రం కూడా చడీ చప్పుడు కాకుండా షూటింగ్ జరుగుతోందట. ఇప్పుడు చెప్పండి మేం పెట్టిన టైటిల్ కరెక్ట్ కాదో.. ????