
తెలుగు సినీ పరిశ్రమ ఏం చేస్తుందో, ఏం చేయాలనుకుంటుందో,
ఎవరికి అర్ధం కావడం లేదు. రాజాసాబ్ కథలో కీలకంగా మారిన, రాజాసాబ్ మహల్ సెట్ వేసింది చిత్ర యూనిట్. ఇందుకోసం దాదాపు 15 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక మెయిన్ టైన్ నెన్స్ కోసం రోజుకు కోటి రూపాయల వరకు ఖర్చు అయిందట. అబ్బ అంత పెద్ద సెట్ వేశారా.. అయితే సినిమాలో అదిరిపోతుంది అనమాట, డిసెంబర్ లో మూవీ రిలీజ్ అయితే, సెట్ లో ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లాలి. థియేటర్స్ లో ఫస్ట్ టైమ్ రాజాసాబ్ మెహల్ అంట అంటూ వావ్ అనాలి.
కాని రాజాసాబ్ నిర్మాతలకు, ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కాని, రాజాసాబ్ ప్యాలెస్ చూస్తారా అంటూ, పాన్ ఇండియా వైడ్ గా ఉన్న సినిమా జర్నలిస్ట్ లను మొత్తాన్ని, మెహల్లోకి ఇన్ వైట్ చేసారు. వాళ్లు ఇష్టం వచ్చినట్లు షూట్ చేసుకుని, వాళ్లకు కావాల్సిన ఫోటోలు దిగి వెళ్లిపోయారు. దీని వల్ల ఏమన్నా జరిగిందా, సినిమాకు ప్రమోషన్ వచ్చిందా.. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన సెట్ ను, కనీసం ప్రమోట్ చేసుకోవడం రాలేదుగా..

గతంలో చంద్రముఖి సినిమాలో కూడా కోట ఒకటి కీలకంగా కనిపించింది. సినిమాలో అదో హైలైట్. ఇప్పటికీ ఆ సినిమాలో ఆ సెట్ ప్రత్యేకంగానే ఉంటుంది. అంతేకాని రాజాసాబ్ చిత్ర యూనిట్ లాగ, ఆరు నెలల ముందునే సెట్ మొత్తాన్ని లీక్ చేసి, ఇందులో రాజాసాబ్ ఉండేవారు. చూడండి అంటూ ఎవరూ చూపించలేదు. అయితే సినిమా థియేటర్ కు వెళ్లి చూడాల్సిన సెట్ ను, ముందే రివీల్ చేస్తే, రేపు థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడు ఏం సర్ ప్రైజ్ అవుతాడు..
మొన్నే టీజర్ రిలీజైంది. సినిమాలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. పైగా టీజర్ కూడా బాగుంది అనే టాక్ వచ్చింది. ముఖ్యంగా రాజాసాబ్ మెహల్ హైలైట్ గా నిలిచింది. అలాంటప్పుడు సినిమా రిలీజ్ వరకు, మెహల్ ను సీక్రెట్ గా ఉంచితే అయిపోయేది. లేదు సెట్ ను తీసేస్తే, అది మీకు మీరే షూట్ చేసి, మంచి వీడియో రూపంలో విడుదల చేస్తే, టీవీ ఛానల్స్ లో మంచిగా ప్రమోషన్ జరిగేది. ఇప్పుడు అందరిని ఆహ్వానించి, సెట్ ను లీక్ చేసి ఏం సాధించినట్లు, ఏది ఏమైనా జరిగిందో జరిగింది. ఇకనైనా నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ, సినిమాను ప్రమోట్ చేయడం ఉత్తమం.
ఇది కూాడా చదవండి
ఇది కూాడా చదవండి