ఇప్పుడు గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉందా, లేక గేమ్ ఛేంజర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా.. లేదా ఇప్పుడే గేమ్ ఛేంజర్ తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటని కనుకున్నారా.. ఎవరైనా ఇలాంటి సినిమా తీసారేంటి అని ఇప్పుడు మీకు చెప్పారా.. లేదు కదా సంక్రాంతి సమయంలో రిలీజైంది. ఫ్లాపైంది. డిజాస్టర్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం లేకపోతే, మీ పునాదులు మొత్తం కూలిపోయేవి. ఇది అయిపోయిన ముచ్చట కదా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత శిరీష్ గారు..

ఇఫ్పుడు మీరు తమ్ముడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెట్టి, తమ్ముడి గురించి కబుర్లు పక్కన పెట్టి, 6 నెలల క్రితం విడుదలైన సినిమా గురించి ఎందుకు డిస్కషన్స్.. పైగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన నటుడిపై అంత చులకనగా మాట్లాడటం చాలా పెద్ద తప్పు.

త్రిబుల్ ఆర్ లాంటి అఖండ విజయం తర్వాత మరో చిత్రం చేయాల్సి ఉన్నా, మీ కోసం , మీ బ్యానర్ కోసం దిల్ రాజుకు ఇచ్చిన మాట కోసం, మూడేళ్లు వెయిట్ చేసాడు చరణ్. ఇది అతని కెరీర్ లో కీలకమైన సమయం. అంత టైమ్ ను మీ బ్యానర్ కోసం వెచ్చిస్తే, అతనికి దక్కింది ఒక డిజాస్టర్.  అయినా సరే ఒక్క మాట మాట్లాడలేదు. కాని మీరు మాత్రం, సినిమా పోయిన తర్వాత పరామర్శించాడా, కనీసం ఫోన్ అయినా చేసాడా, రెమ్యూనరేషన్ తిరిగిచ్చాడా అంటూ ఒక ఇంటర్వ్యూలో మీ ఆక్రోశాన్ని వెళ్లదీశారు.

గేమ్ ఛేంజర్ సినిమాతోనే, అయిపోలేదు కదా.. మెగా హీరోలతో మీకున్న అనుబంధం ఈనాటికి కాదు కదా.. చిరు, చరణ్, పవన్, సాయి ధరమ్ తేజ్, అందరూ తెల్సు కదా.. చిరు తో తప్పితే అందరితోనూ సినిమాలు చేసారు, డిస్ట్రిబ్యూట్ చేసారు కదా.. అసలు తొలిప్రేమ లేకపోతే దిల్ రాజు అనే వాడే లేడు అని రాజు గారు ఎన్ని సార్లు చెప్పారు. అయినా సరే చరణ్ ను ఒక్కడినే టార్గెట్ చేసారు అంటే… మీ ఉద్దేశ్యం ఏంటి,

ఇదే ఇంటర్య్వూలో మరో హీరోను ఆకాశానికి ఎత్తేశారు. ఇది ఇంకా తప్పు. మీ బ్యానర్ కోసం ఒక హీరో మూడేళ్లు సమయం  కేటాయిస్తే, మరో హీరో మీ బ్యానర్ లో మూవీ చేయాల్సి ఉండగా, ఇంత వరకు చేయకపోతే, అది వదిలేసి, చేసిన హీరోను టార్గెట్ చేస్తారా.. అసలు ఇన్నేళ్లు మీతో అనుబంధం కొనసాగించిన వారు ఎంత బాధపడి ఉంటారో ఆలోచించారా.. చివరికి మెగాఅభిమానులు ఆగ్రహాం వ్యక్తం చేస్తే, మెగా ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉంది, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి అంటూ లెటర్స్ రిలీజ్ చేస్తారా.. ఇంత జరిగిన తర్వాత మెగా హీరోలు మళ్లీ బ్యానర్ గడప తొక్కుతారా.. ?

ఇవి కూడా చదవండి

error: Content is protected !!