కన్నప్ప రిలీజ్ కు ముందు మరోసారి తెరపైకి వచ్చాడు మంచు మనోజ్. కొన్ని రోజులుగా విష్ణు తీరును తప్పుబడుతూ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు మనోజ్. అయితే భైరవం రిలీజ్ సమయంలో కాస్త మెత్తబడ్డినట్లు కనిపించాడు. మంచు విష్ణును ఎక్కడా టార్గెట్ చేయలేదు. మరో వైపు తండ్రి పై ప్రేమను మాత్రం కొనసాగిస్తున్నాడు. ఇదే సమయంలో కన్నప్ప రిలీజ్ సమయంలో పోస్ట్ రాసుకొచ్చాడు మనోజ్. చిత్ర యూనిట్ లో పని చేసిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కాకపోతే విష్ణు గురించి  అస్సలు ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు కన్నప్ప చూసేందుకు సిద్ధమవుతున్నాడు. రిలీజ్ రోజు ఉదయం ఆటకు చూసేందుకు ప్రసాద్ ఐమ్యాక్ వెళ్లనున్నాడు మనోజ్.. తనతో పాటు తన కుటుంబ సభ్యులను, అలాగే స్నేహితులను కూడా తీసుకువెళ్తున్నాడట.

కన్నప్ప చూసేందుకు వెళ్లిన మనోజ్, సినిమా చూసి బయటికి వచ్చి విష్ణు నటనపై రివ్యూ ఇచ్చాడా… అది పాజిటివ్ గా ఇస్తే ఏ గోల ఉండదు. కాని నెగిటివ్ గా ఇస్తే మాత్రం మళ్లీ అగ్గి రాచుకుంటుంది. విష్ణు ఆల్రెడీ సినిమా గురించి ట్రోల్ చేయవద్దు అంటూ ఫేక్ రివ్యూస్ ఇస్తే చట్టపరమైన చర్యలు చేపడతాను నోటీస్ ఇచ్చాడు. ఈ సమయంలో మనోజ్ దిగి రచ్చ రచ్చ చేస్తే మాత్రం విష్ణు ఊరుకునే పరిస్థితుల్లో ఉండదు. మొత్తంగా ఇప్పుడు కన్నప్పపై మనోజ్ ఇచ్చే రివ్యూ ఎలా ఉండబోతోంది అనేద ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

error: Content is protected !!