
కొద్ది గంటల క్రితం రిలీజైన అఖండ సీక్వెల్, బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని వెబ్ సైట్స్ అయితే మరీ దారుణమైన రేటింగ్స్ అందించాయి. దీంతో సినిమా ఫలితం ఎలా ఉండబోతోంది అనేది వీకెండ్ దాటితే కాని ఒక క్లారిటీ రాదు. ఈ సంగతి ఇలా ఉంటే అఖండ-2 తర్వాత అఖండ -3కి లైన్ క్లియర్ చేసాడు బోయపాటి. అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ అఖండ -2 క్లైమాక్స్ లో కూడా వచ్చింది. అయితే అఖండ -2కు వస్తోన్న టాక్‌ను బట్టి, మూడో భాగం ఉంటుందా అనే డౌట్ రావచ్చు.
కాని బోయపాటితో బాలయ్యకు ఉన్న అనుబంధంతో, నటసింహం తప్పకుండా జై అఖండ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా అఖండ పాత్ర అంటే బాలయ్యకు అభిమానం, ప్రేమ, ఇష్టం ఏర్పడ్డాయి. కొన్ని తప్పులు దిద్దుకోని, సేమ్ కాంబోలో మరికొన్ని రోజుల తర్వాత జై అఖండ వచ్చినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి
