కెనడా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించి సంచలనం సృష్టించాడు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగాతని స్పష్టం చేసాడు. ట్రూడో వైదొలగాలంటూ సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఒత్తిడి ఉంది.  ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ నాయకత్వానికి, అలాగే ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ట్రూడో ప్రకటించాడు. దశాబ్ధ కాలం పాటు కెనడా ప్రధాన మంత్రిగా సేవలు అందించాడు ట్రూడో.. అయితే తన రాజకీయ జీవితంలో ఎన్నడూ సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు ట్రూడో, సొంత పార్టీ నేతల నుంచే రాజీనామా డిమాండ్ రావడంతో చేసేది లేక రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నడు ట్రూడో. కెనడా చట్టం ప్రకారం.. అధికార పార్టీ నేత రాజీనామా చేసిన తర్వాత 90 రోజుల్లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉప ప్రధాని క్రిష్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేసారు.

error: Content is protected !!