
స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన భగత్ సింగ్ ..హింసా మార్గంలోనే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మారు. 25 ఏళ్ల వయసులోనే ఉరిశిక్ష పడుతుందని తెల్సినా భగత్ సింగ్ చేసిన సాహసం అసమాన్యం. అలాంటి విప్లవకారుడి జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఘట్టాలను మన కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది పాకిస్థాన్ ప్రభుత్వం. భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్ ప్రాంతలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907లో సెప్టెంబర్ 28న జన్మించారు. ఇన్నాళ్లకు మళ్లీ పాకిస్థాన్ ప్రభుత్వం భగత్ సింగ్ గ్యాలరీని సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి పూంఛ్ హౌస్ లోని భగత్ సింగ్ గ్యాలరీని సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యాలరీలో భగత్ సింగ్ ఫోటోలు, లేఖలు, అప్పటి వార్త పత్రికలు, భగత్ జీవిత విశేషాలు, ఇలాంటివి ఎన్నో ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇది భారత్ కు మంచి విషయం.

- వారణాసి తర్వాత, మహేష్ మళ్లీ సరిలేరు నీకెవ్వరు అనిపిస్తాడా?
- సూర్యతో సినిమా .. ఇంత ఈజీనా?
- ఓజీ సీక్వెల్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్, రిలీజ్ కావడమే బ్యాలెన్స్…!
- వారంలో టాక్సిక్, ఎక్కడెంత ఎంత వచ్చిందో తెలుసా.. ?
- తమిళనాట విజయ్ మరో సంచలనం, సీఎం కేక్స్ కోసం ఎగబడుతున్న జనం
- పవన్ దారిలో బన్ని భుజానికి గాయం, కాని ఇప్పుడు కాదు…
- వద్దు.. వద్దు.. అలా చేయవద్దు, బాలయ్య హీరోయిన్ విజ్ఞప్తి
- 6 టీన్స్ కు సీక్వెల్, రిస్క్ మూవీ ఎలా ఉంది?
- కాంచనలోకి చంద్రముఖి హీరోయిన్, లారెన్స్ గేమ్ ఛేంజింగ్ ప్లాన్
- సింగిల్ స్క్రీన్స్ లో పెద్దికి షాక్, నో షోస్..? 30 కోట్లు లాస్?
