
ఒకప్పుడు త్రివిక్రమ్ చిత్రం అంటే, ఆ క్రేజ్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాని ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలకు ఆ క్రేజ్ లేదు. ఈ విషయాన్ని ఆదర్శ కుటుంబం కలెక్షన్లు చెబుతున్నాయి. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదర్శ కుటుంబం, తొలి వీకెండ్ అంటే తొలి మూడు రోజుల్లో 75 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేసింది.
కాకపోతే ఇవి ఫేక్ కలెక్షన్స్ అని, తొలి మూడు రోజుల్లో ఆదర్శ కుటుంబం కలెక్షన్స్ 50కోట్లు కూడా దాటలేదని, కొంత మంది ట్రాకర్స్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. సరే ఈ సంగతి పక్కన పెడితే, సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్‌లో మరింత డ్రాప్ కనిపించడం మాత్రం, త్రివిక్రమ్‌కు మాత్రమే కాదు, టాలీవుడ్‌కు బిగ్ షాక్‌గా నిలిచింది. సోమవారం నుంచి 70 శాతం వసూళ్లలో డ్రాప్ అంటే చిన్న విషయం కాదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలి అంటే 125 కోట్ల గ్రాస్ వసూళ్లను అవసరం ఉండగా, సినిమా రిలీజై 5 రోజులు అవుతున్నా ఇంకా సగం కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ దశలో ఈ సినిమాకు మరో గండం పొంచి ఉంది, అదే బాలీవుడ్ నుంచి రామాయణ చిత్రం, తమిళ నుంచి సూర్య కొత్త చిత్రం సీన్. ఇవి ఈ వీకెండ్‌కు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మంచి టాక్ అందుకుంటే మాత్రం ఆదర్శ కుటుంబం కష్టాలు మరింత పెరుగుతాయి. పనిలో పనిగా త్రివిక్రమ్‌కు కూడా కష్టాలు మరింత పెరుగుతాయి.
ఈ సినిమా వసూళ్ల పై మరిన్ని అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ప్రైడ్ తెలుగు మీకు అందిస్తుంటుంది… ఫాలో అవ్వడం, షేర్ చేయండి, ప్రోత్సహించండి..
ఇవి కూడా చదవండి..
