సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే కొత్త చిత్రం, ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ నుంచి రెగ్యూలర్ షూటింగ్ పెట్టుకున్నారు. అయితే ఇంతవరకు హీరోయిన్ ఫైనల్ కాకపోవడం మెగాభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

సినిమా ప్రారంభోత్సవం నాటికి కథానాయిక ఫైనల్ అవుతుందని అందరూ ఊహించారు. సినిమా ఓపెనింగ్‌కు హీరోయిన్‌ కూడా వస్తుందని అందరూ ఊహించారు. అయితే ప్రారంభోత్సవంలో ఎక్కడా కథానాయిక కనిపించలేదు. దీంతో కావాలనే సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు అనుకున్నారు అంతా.. అయితే అసలు హీరోయిన్ ఇంతవరకు ఫిక్స్ కాలేదట.

ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్, సయ్యారా ఫేమ్ అనిత్ పడ్డా, ఆకాశంలో ఒక తార కథానాయిక సాత్విక వీరవల్లి పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, ఇప్పుడు సుకుమార్ మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నాడని, ఆమె ఎవరూ అనేది ఇంకా ఇండస్ట్రీ వర్గాలకు కూడా తెలియదని, అందుకే ఇంత సస్పెన్స్ గా మారిందని,ఒక దశలో మమిత బైజు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోన్నా, అది ఎంతవరకు నిజం అనేది తెలియడం లేదు. మొత్తంగా రామ్ చరణ్ కొత్త చిత్రంలో హీరోయిన్ ఎవరూ అనేది ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌ గా హాట్‌ టాపిక్‌గా మారింది.

RC17 పై మరిన్ని అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ప్రైడ్ తెలుగు మీకు అందిస్తుంటుంది… ఫాలో అవ్వడం, షేర్ చేయండి, ప్రోత్సహించండి..

ఇవి కూడా చదవండి..

error: Content is protected !!