కొత్త సినిమాలను ఎనౌన్స్ చేయడంలో, ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేసే తీరు, ప్రతిసారి ఆశ్చర్యపరుస్తుంది. అది దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ఎనౌన్స్ చేసినా,లేదా త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ చేయబోతున్నట్లు ప్రకటన చేసినా,ఇఫ్పుడు అనిల్ రావిపూడితో సినిమా ఖరారు అయినా, టాలీవుడ్డే కాదు, కనీసం టైగర్ ఫ్యాన్స్ కూడా ఊహించలేరు. ఈ విషయంలో ఎన్టీఆర్ ను మెచ్చుకుని తీరాల్సిందే.

త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియాకు ఎదిగిన ఎన్టీఆర్, ఆ తర్వాత దేవర , వార్ సీక్వెల్ లాంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే భారీ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నిజానికి ఎన్టీఆర్ లైనప్ లో ఇమిడియెట్ గా ప్రారంభం కావాల్సిన సినిమా గాడ్ ఆఫ్ వార్. కాని ఇంతలో అనిల్ రావిపూడితో మూవీ ఎనౌన్స్ చేసాడు ఎన్టీఆర్.

ఇది నిజంగా టెర్రిఫిక్ కాంబినేషన్, ఎవరూ ఊహించని ప్రాజెక్ట్. అనిల్ రావిపూడి అంటే బ్లాక్ బస్టర్స్ కు మారుపేరు.. అది ఎందుకు అనేది అతని కెరీర్ ను చూస్తే తెలుస్తుంది. హిట్ సినిమా ఇవ్వాల్సి వస్తే, మినిమం బడ్జెట్ తో మూవీ తీయాల్సి వస్తే, పక్కాగా హిట్ ఇవ్వాల్సి వస్తే అందులో రావిపూడికి మించిన దర్శకుడు లేడు. పైగా వెంకటేష్, చిరంజీవి,బాలకృష్ణకు మాత్రమే కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ ఇవ్వగలడు. అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. ఇది పక్కగా టాలీవుడ్ కు పండగ లాంటి వార్త.

మరో విశేషం ఏంటంటే ఇది అనిల్ రావిపూడి శైలిలో సాగే ఫక్తు కమర్షియల్ చిత్రం. గతంలో ఎప్పుడో అదుర్స్ సమయంలో పూర్తిస్థాయి కామెడీ మూవీ చేసాడు ఎన్టీఆర్.మళ్లీ ఇన్నాళ్లకు అదే తరహా జానర్ లో మూవీ చేయబోతున్నాడు. పైగా టాలీవుడ్స్ బెస్ట్ కామెడీ డైరెక్టర్ తో మూవీ లాక్ చేసుకున్నాడు. దీంతో కొంత కాలంగా సీరియస్ రోల్స్ లో మాత్రమే కనిపిస్తూ వస్తోన్న ఎన్టీఆర్ , ఇలాంటి క్యారెక్టర్స్ కు బ్రేక్ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది,నిర్మాత ఎవరూ అనేది క్లారిటీ ఇవ్వలేదు. ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినప్పుడు ఫోటోలో వెనుక కల్యాణ్ రామ్ కూడా ఉండటంతో, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోనే ఈ చిత్రం ఉంటుందా అనేది చూడాల్సి ఉంది.

ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్, కల్యాణ్ రామ్ కాంబినేషన్ లో జనవరి 12 విడుదల అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. నిజానికి గతంలోనే ఎన్టీఆర్, రావిపూడి కలసి సినిమా చేయాల్సి ఉండగా, కథ కుదరకపోవడంతోనే వీరి కాంబినేషన్ లో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు స్టోరీ కుదిరింది, టైమ్ కూడా కుదిరింది. అందుకే ఎనౌన్స్ చేసారు.

డ్రాగన్ తర్వాత గాడ్ ఆఫ్ వార్ ప్రారంభం అయితే రెండు సినిమాల మధ్య చాలా వ్యవధి వస్తుంది,  అందుకే, డ్రాగన్ విడుదల తర్వాత ఇమిడియెట్ రావిపూడితో మూవీని పట్టాలెక్కించాలి అనుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇది ఓ విధంగా చాలా మంచి నిర్ణయం అని పరిశ్రమ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ సినిమా విడుదల సమయానికి మళ్లీ గాడ్ ఆఫ్ వార్ స్టార్ట్ చేస్తే అప్పుడు పెద్దగా గ్యాప్ రాదు అనేది ఎన్టీఆర్ ప్లాన్‌గా కనిపిస్తోంది.

ఎన్టీఆర్, అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ను ప్రైడ్ తెలుగు ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది. చదువుతూనే ఉండండి..

ఇవి కూడా చదవండి

error: Content is protected !!