
అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈపాటికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, గాడ్ ఆఫ్ వార్ అనే పౌరాణిక చిత్రం చేస్తుండేవాడు. కుమారస్వామి పాత్రలో అబ్బురపరిచేవాడు. కాని త్రివిక్రమ్ ను కాదని అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ మేకింగ్ లో రాకా అనే సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్ తన దారి తాను చూసుకున్నాడు. అల్లు అర్జున్ తో ప్లాన్ చేసిన గాడ్ ఆఫ్ వార్ మూవీని ఎన్టీఆర్ తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇది ఇప్పటి వరకు తెల్సిన స్టోరీ.
అయితే రామాయణం విడుదల తర్వాత ఈ సినిమాకు వస్తోన్న ఆదరణతో, ఇఫ్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా ఓ మైథాలజీ మూవీ చేయాలనే ఆశ కలిగింది. దీంతో త్రివిక్రమ్ స్థానంలో బోయపాటి మేకింగ్ లో ఓ పౌరాణిక నేపథ్యం ఉన్న చిత్రం చేయాలి అనుకుంటున్నట్లు సమాచారం. అయితే బోయపాటి ప్రస్తుతం స్కంధ, అఖండ సీక్వెల్ లాంటి ఫ్లాప్స్ తీసి డీలా పడ్డాడు అయినా సరే, బోయపాటితోనే సినిమా చేయాలనుకుంటున్నాడట అల్లు అర్జున్. అందుకే ఇటీవల తిరుమల వచ్చినప్పుడు త్వరలోనే గుడ్ న్యూస్ ఎనౌన్స్ చేస్తానన్నాడు బోయపాటి.
ఏది ఏమైనా ఇప్పుడు బోయపాటితో బన్ని సినిమా చేయబోతున్నాడు.. కాకపోతే రాకా తర్వాత లోకేష్ కనగరాజ్ తో సినిమా లాక్ చేసుకున్నాడు ఐకాన్. డిసెంబర్ లేదా జనవరిలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఆ తర్వాత లైన్ లో మాలీవుడ్ డైరెక్టర్ బేసిల్ జోసెఫ్ ఉన్నాడు. మరి బోయపాటితో అది కూడా మైథాలజీ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనేది కాస్త క్యూరియాసిటీని కలిగిస్తోంది.
బోయపాటి, బన్ని కాంబినేషన్ లో సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ను ప్రైడ్ తెలుగు ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది. చదువుతూనే ఉండండి..
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి
