
ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయంలో, కోవిడ్ 19 ను వరల్డ్ కు పరిచయం చేసింది చైనా. దాదాపు మూడేళ్ల పాటు కరోనా కల్లోలం సృష్టించింది. ఎందరినో తనతో తీసుకుపోయింది. లాడ్ డౌన్లు, శానిటైజర్లు, మాస్కలను, లేకుండా, బ్రతకలేని పరిస్థితులను తీసుకొచ్చింది. రెండేళ్లుగా కరోనా తగ్గుముఖం పట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మరోమారు చైనాలో ఒక వింత వైరస్, అక్కడి ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొత్త వైరస్ ఎక్కువగా నిమోనియా తరహాలో ఉండి.. విస్తరిస్తోంది. దాంతో చైనాలో ప్రజలు పెద్ద సంఖ్యలో అనారోగ్యానికి గురవుతున్నారని, సోషల్ మీడియాలో బయటపడుతున్న వీడియోలు, పోస్టులు, మిగితా ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. హ్యూమన్ మెటానిమో వైరస్ ( hmpv) వేగంగా వ్యాప్తిస్తోందని, అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాసుకొస్తున్నాయి. కోవిడ్ తరహా లక్షణాలతోనే కనిపిస్తున్నాయట. ప్రస్తుతం చైనా ప్రభుత్వం ఈ కొత్త వైరస్ నిరోధానికి ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది. ఏది ఏమైనా చైనాలో కొత్త వైరస్ అనగానే , ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఒక భయం మొదలైంది. చైనా ముందుగానే వైరస్ ను నియంత్రిస్తే మంచిది లేదా మరో కోవిడ్ తరహా కాలాన్ని మళ్లీ ప్రజలు చూడాలి అనుకోవడం లేదు.