టాలీవుడ్ మొత్తం గేమ్ ఛేంజర్ ట్రైలర్ గురించి మాట్లాడుతుండగా, సైలెంట్ గా డాకు మహారాజ్ నుంచి కొత్త సింగిల్ రిలీజైంది. అదే దిబిడి .. దిబిడి మాస్ సాంగ్. అసలే బాలయ్య, తమన్ కాంబినేషన్, పైగా బాబి డైరెక్షన్ లో మాస్ సాంగ్ అంటే, చాలా అంచనాలు పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే బీట్ సంగతి ఎలా ఉన్నా, పాటకు శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ పై విమర్శలు వస్తున్నాయి. తెలుగు సినిమా స్థాయిని తగ్గించే విధంగా శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేసారంటూ, సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురుస్తోంది. అసలు డాకు మహారాజ్ గురించి పాన్ ఇండియా ఆడియెన్స్ కు తెలియదు. ఇది పాన్ ఇండియా మూవీ కూడా కాదు. కాని ఇప్పుడు రిలీజైన దబిడి దిబిడి సాంగ్, సాంగ్ లో రాంగ్ స్టెప్స్ వల్ల, పాన్ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతోంది. ట్రోల్ అవుతోంది. నిన్న కాక మొన్న డాకు నిర్మాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓనర్ నాగ వంశీ బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ మరోసారి హైలైట్ అవుతున్నాయి. జనవరి 12న సంక్రాంతి పండగ కానుకగా, ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సాంగ్ పై వచ్చిన విమర్శల నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.

error: Content is protected !!