ఆక్రమణ లేదా దండయాత్ర,ఇలాంటి పదాలను ఎక్కువగా రాజులకు, రాజ్యాలకు ఉపయోగిస్తుంటాం. కాని ఇప్పుడు పుష్పరాజ్ కు ఇలాంటి పదాలను వాడాల్సి వస్తోంది. ఇప్పటికే భారతీయ సినిమా చరిత్రలో ఏ చిత్రం కొల్లగొట్టని వసూళ్లను కొల్లగొడుతున్నాడు పుష్పరాజ్. ఆల్రెడీ బాలీవుడ్ ను కబ్జా చేసాడు. అక్కడ 25 రోజుల్లో 770 కోట్ల వసూళ్లను రాబట్టాడు. హిందీ ఇండస్ట్రీ హిస్టరీలో ఇలాంటి కలెక్షన్స్ ఫస్ట్ టైమ్. ఇప్పుడు బెంగాల్లోనూ ఇదే తరహా రికార్డ్ నెలకొల్పాడు. వెస్ట్ బెంగాల్ అంటే, అక్కడ హిందీ హీరోల డామినేషన్ ఉంటుంది. కాని అక్కడ కూడా పుష్పరాజ్ డామినేషన్ మొదలైంది. బెంగాల్ సినిమా ఇండస్ట్రీలో మొదటిసారి ఒక చిత్రం 50కోట్ల వసూళ్లను అందుకుని చరిత్ర సృష్టించింది. అదే అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప -2 చిత్రం. ఒక్క బెంగాలి చిత్రం కాని, లేదా బాలీవుడ్ సినిమా కాని, ఇంతవరకు 50 కోట్ల వసూళ్లను చూడలేదు. ఇది నిజం గా తెలుగు సినిమాకు గర్వకారణం. అల్లు అర్జున్ స్టార్ డమ్ కు నిదర్శనం. వెస్ట్ బెంగాల్ లాంటి నాన్ ఫిల్మ్ రివెన్యూ స్టేట్ నుంచి కూడా పుష్ప -2 50 కోట్లు రాబట్టింది

error: Content is protected !!