వెబ్ సైట్ కు వ్యూస్ పెరగాలి అంటే, ఏ టైటిల్ పెడితే ఆ టైటిల్ పెట్టకూడదు సామి, అందరూ నవ్వుతారు. మహేష్ తో రాజమౌళి చిత్రం, ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. అప్పుడే రిలీజ్ డేట్ చెప్పేస్తున్నారు. బహుశా రాజమౌళి కూడా చెప్పలేడు కదా అంటారా.. కాని కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే, మహేష్ బాబు తో తెరకెక్కించే చిత్రాన్ని రాజమౌళి ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నాడు ఇట్టే అర్ధమయిపోతుంది. ఈ చిత్రాన్ని జనవరి 2,2025న లాంఛింగ్ కు సిద్ధం చేస్తున్నారు. జనవరి నెలాఖరు లేదా వేసవిలోనో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అంటే రెండేళ్ల పాటు పూర్తి నిర్మాణంలో ఉంటుంది. 2026 సంక్రాంతి సీజన్ కు ఎలాగూ సినిమా సిద్ధం కాదు. మరి 2027కు మాత్రం ఛాన్స్ ఉంది. పైగా ఇలాంటి ప్రస్టీజీయస్ చిత్రాన్ని పండగ సమయాల్లో రిలీజ్ చేస్తే, రిపీట్ ఆడియెన్స్ ఉంటారు. ఎన్నోరికార్డులు బద్దలు కావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి పండక్కి విడుదలకు ముస్తాబుచేస్తున్నారని ప్రైడ్ తెలుగు అంచనా వేస్తోంది.

మొత్తంగా రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది.మొదటి భాగాన్ని రెండేళ్ల తర్వాత వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇక హీరోయిన్ గా  ప్రియాంక చోప్రా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. విలన్ రోల్ కోసం మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ను రాజమౌళి ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా మళ్లీ మహేష్ ను తెరపై చూడాలంటే మాత్రం అభిమానులు మరో రెండేళ్లు వేచి చూడక తప్పదు.

error: Content is protected !!