భారతీయ సినిమా చరిత్రలో, జనవరి 6, 2025 తేదీకి ప్రత్యేక స్థానం ఉండబోతోంది. అందుకు కారణం, 2017లో విడుదలైన ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, బాహుబలి 2 బాక్సాఫీస్ రికార్డులను, పుష్ప -2 బద్దలు కొట్టడమే ప్రధాన కారణం. ఈ 8 ఏళ్ల కాలంలో, ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కేజీయఫ్ 2, త్రిబుల్ ఆర్, సలార్, పఠాన్, జవాన్, కల్కి, ఇలా చాలా  పాన్ ఇండియా  బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కాని పుష్ప -2 మాత్రమే, బాహుబలి 2 రికార్డులను బద్దలుకొట్టగలిగింది. రాజమౌళి చిత్రం వసూళ్లను అంటే 1810 కోట్లు ను, పుష్ప -2 చిత్రం కేవలం 32 రోజుల్లో అధికమించింది. 32 రోజుల్లో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ 1830కోట్లకు పైగానే రాబట్టింది. పుష్ప సీక్వెల్ కొల్లగొట్టిన 1800 కోట్ల వసూళ్లలో, 800 కోట్లు బాలీవుడ్ నుంచే వచ్చాయి. మిగితా వెయ్యి కోట్లు, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చాయి. ప్రస్తుతం పుష్ప-2 టార్గెట్ దంగల్ వసూళ్లు. ఈ సినిమా వసూళ్లు రెండు వేల కోట్లు. మరి పుష్ప ఈ టార్గెట్ ను రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే వీకెండ్  కు సంక్రాంతి సినిమాల సందడి మొదలవుతుంది. ఆ తర్వాత పుష్ప -2కు థియేటర్స్ సమస్య వస్తుంది. మరో వైపు చాలా ఇండస్ట్రీస్ లో పుష్ప సీక్వెల్ రన్ ముగిసింది. ఈ దశలో ఇతర దేశాల్లో ఈ చిత్రం విడుదల తర్వాత ఎంత రాబడుతుంది అనేదాని మీద ఆధారపడుతుంది. ప్రస్తుతానికి అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏది అంటే పుష్ప -2 పేరే చెప్పాలి.

error: Content is protected !!