
పెద్ది ప్లేస్ లో పీకే అనగానే, రామ్ చరణ్ స్థానంలో పవన్ కల్యాణ్ అనుకునేరు, అది కాదు మ్యాటర్. పెద్ది అంటే రామ్ చరణ్, ఇక పీకే అంటే బాలీవుడ్ లో గతంలో వచ్చిన పీకే మూవీ. ఆ సినిమాలో పీకే పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్. టైటిల్ వెనుక స్టోరీ చూసారుగా, ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వెళ్దాం.
బాలీవుడ్ కు సంబంధించినంత వరకు, ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ సమయంలో ఒక డెడ్లీ కాంబినేషన్ ఫిక్స్ అయితే ఎలా ఉంటుంది. అదే రాజ్ కుమార్ హిరాణి, ఆమిర్ ఖాన్ కాంబినేషన్. గతంలో వీరిద్దరు చేతులు కలిపినప్పుడు, పాన్ ఇండియా షేక్ అయింది. హిందీ ఇండస్ట్రీపైన కాసుల వర్షం కురిసింది. 2009లో వచ్చిన 3 ఇడియెట్స్, 2014 పీకే చిత్రాలు, ఎంతటి సంచలన విజయాలు సాధించాయో తెల్సిందే..
షారుఖ్ తో డంకీ తీసి రాజ్ కుమార్ హిరాణి కాస్త నిరాశపరిచాడు. అలాగే ఆమిర్ ఖాన్ కూడా వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు. దంగల్ తర్వాత మళ్లీ అంతటి విజయం లేదు. ఈ దశలో హిరాణితో ఆమిర్ ఖాన్ మళ్లీ సినిమా అంటే మాత్రం, అది వారిద్దరి కెరీర్ కు మాత్రమే కాదు, టోటల్ బాలీవుడ్ కు ఇంపార్టెంట్ మూవీగా మారనుంది. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. జూన్ 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్రిబుల్ ఆర్ విజయంతో బాలీవుడ్ లోనూ స్టార్ గా మారాడు రామ్ చరణ్ , ఈ దశలో హిందీలో డైరెక్ట్ మూవీ చేయాలనుకుంటున్నాడు. అందులో భాగంగా చరణ్ కూడా రాజ్ కుమార్ హిరాణి మేకింగ్ లో నటిస్తాడని బాలీవుడ్ లో బాగా ప్రచారం సాగింది. కాని రామ్ చరణ్ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో హిరాణి, ప్రస్తుతం తన ఫేవరేట్ యాక్టర్ తో సినిమా చేసేందుకు మొగ్గు చూపుతున్నాడు.