
శేఖర్ కమ్ముల అంటే, మంచి కాఫీ లాంటి చిత్రాలు మాత్రమే వస్తాయి అనుకుంటే ఎలా, ఎంతసేపు ఫిదా, లవ్ స్టోరీ లాంటి మూవీస్ మాత్రమే తీస్తాడు అనుకుంటే ఎలా, అతనిలో కూడా అతనికి తెలియని దర్శకుడు ఉన్నాడు. అందుకే అత్యంత ధనంవంతుడికి, అత్యంత పేద వాడికి మధ్య యుద్ధం నడిచే, కథను కుబేరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ కథ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రెండు భిన్న ప్రపంచాలకు సంబంధించిన వ్యక్తుల మనోభావాలను ఆవిష్కరిస్తూ, స్క్రీన్ ప్లే నడపాల్సి ఉంటుంది. అత్యంత ధనికుడిగా జిమి సర్బ్ సూపర్బ్ గా నటిస్తే, అత్యంత పేదవాడిగా, బిచ్చగాడిగా ధనుష్ నటించాడు. వీరిద్దరి బ్రిడ్జ్ గా నాగార్జున నటించాడు. అనుకోకండా వీరి కథలోకి రష్మిక అడుగుపెడుతుంది.ఇక ఆ తర్వాత ఏం జరిగింది బిల్లియనియర్ వర్సెస్ బెగ్గర్ వార్ ఎలా జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కుబేర సినిమాకు కథను, స్క్రీన్ ప్లేను,మాటలను,దర్శకత్వాన్ని శేఖర్ కమ్ముల అందించాడు. ఈ చిత్రంతో అతని గత చిత్రాలతో అస్సలు పోలీక లేదు. పైగా చెప్పాల్సిన పాయింట్ ను చాలా నిజాయితీగా చెప్పాడు. కమర్షియల్ డిమాండ్స్ కు తలొగ్గకుండా,చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా చెప్పాడు. అయితే అందుకోసం ఎక్కువ సమయం తీసుకున్నాడు. మూడు గంటలు దాటి సినిమా సాగడం ఒక్కటే ఈ సినిమా మెయిన్ మైనస్. మిగితాది అంతా ప్లస్.
ఈ సినిమాలో కొన్ని సీన్స్ ను శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం, రాసిన డైలాగ్స్ అతనిపై గౌరవాన్ని పెంచుతాయి. ఇలాంటి దర్శకుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడా అంటూ గర్వపడేలా చేస్తాయి.
ఇక ధనుష్ నటన, ఈ సినిమాలో మరో స్థాయిలో నిలిచింది. అంత పెద్ద నటుడు, తమిళనాడులో, తెలుగు రాష్ట్రాలో తిరుగులేని స్టార్, కెరీర్ లో 50 చిత్రాలకు పైగా నటించాడు. అయినా సరే, బిచ్చగాడి పాత్రకు అద్భుతంగా న్యాయం చేసాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసాడు. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న చిత్రంలో, ధనుష్ వన్ మ్యాన్ షో చేసాడు. కొన్ని సీన్స్ ను రక్తి కట్టించాడు. ఈ పాత్రను అతను తప్పమరెవరూ నటించలేరు అనే విధంగా పర్ఫామ్ చేసాడు.
ఇక రష్మిక నటన చాలా సహజంగా సాగింది. కాని నాగార్జున పాత్రలో మాత్రం కన్ ఫ్యూజన్ కొనసాగింది. హీరోయిజం పక్కన పెట్టి, చాలా సింపుల్ గా ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేసాడు శేఖర్ కమ్ముల. అందుకు నాగార్జున కూడా ఒప్పుకోవడం విశేషం. అంటే నాగార్జున కదా, ఎక్కడైనా హీరోయిజం చూపించే స్టెప్ తీసుకుంటాడు అనుకుంటే, ఎక్కడా రిస్క్ తీసుకోకుండా, స్టోరీ కి తగ్గట్లు ఆ పాత్రను చేసుకుంటూ వెళ్లాడు.
ఇక సినిమాలో కనిపించని మరో హీరో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సినిమాకు తగ్గ సాంగ్స్ ను, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి అదరగొట్టాడు. సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి పని తనం ప్రతి ఫ్రేమ్ లోను కనిపించింది. మొత్తంగా కుబేర , తెలుగు ప్రేక్షకులు తప్పక చూడాల్సిన చిత్రం. ప్రతి శుక్రవారం థియేటర్స్ లోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కాని కుబేర లాంటి చిత్రం మాత్రం ఎప్పుడో శేఖర్ కమ్ముల లాంటి వారు తీసినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి మిస్ కాకండి. ఈ చిత్రానికి ప్రైడ్ తెలుగు ఇస్తోన్న రేటింగ్ 3.5/5
ఇది కూడా చదవండి