సినిమా మాట్లాడాలి, వసూళ్లు మాట్లాడాలి, హిట్ రావాలి, బ్లాక్ బస్టర్ పడాలి, నటన గురించి మెచ్చుకోవాలి. ఇవి కావు, ఎంత సేపు కాంట్రవర్సీలు. తెలిసో, తెలియక మాట్లాడటం, తర్వాత అవి వివాదంగా మారడం ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో తరచూ జరుగుతోంది. కింగ్డమ్ రిలీజ్ డేట్ ఇలా వచ్చిందో  లేదో, అటు ప్రమోషన్స్  స్టార్ట్ చేసేసాడు విజయ్. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్యూలో గంటకు పైగా మాట్లాడాడు. అందులో రెండు విషయాలపై ఇఫ్పుడు సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. వినడానికి విచిత్రంగానూ, విజయ్ చెప్పేదాంట్లో పస లేదంటున్నారు.

ముందుగా ఫస్ట్ కాంట్రవర్సీ వైపు చూస్తే, అంటే ఇంటర్వ్యూలో విజయ్ చేసిన కామెంట్స్ చూస్తే, లైగర్ రిలీజ్ టైమ్ లో,  విజయ్ దేవకొండకు ట్యాగ్ లైన్ లేదని చిత్ర యూనిట్, ది విజయ్ దేవరకొండ అనే ట్యాగ్ ఫిక్స్ చేసిందట.. అంటే తన పేరుకు ముందు ది అనేఅక్షరం మాత్రమే పెట్టిందట. దానికి పెద్ద ఎత్తున వివాదం మొదలైందని, తనను ఎంతో బాధపెట్టిందని, వెంటనే ఆ అక్షరం తీసేసి, సింపుల్ విజయ్ దేవరకొండ అనే రాయండి చెప్పాడట.

అయితే ఈ వివాదం ఎప్పుడు జరిగింది అనేది కనీసం సినీ ప్రముఖులకు కూడా తెలియదు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు ట్యాగ్స్ ఉంటున్నాయని, తనకు లేవని చెబుతున్నాడు విజయ్. ప్రేక్షకులు కేవలం తన నటనతో మాత్రమే గుర్తుపెట్టుకోవాలని చెప్పుకొచ్చాడు. మరి రౌడీ ట్యాగ్ ఎవరిది విజయ్ ? అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్.

అయినా ది అనే అక్షరం జోడిస్తే ,అభ్యంతరం తెలిపింది ఎవరు..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రెండవ కాంట్రవర్సీ ఏంటంటే, ఇంకా పెద్ద కాంట్రవర్సీ. ఇండస్ట్రీలో తనకు బ్యాక్ గ్రౌండ్ లేదని, అందుకే తన దగ్గరికి  డైరెక్టర్ తెచ్చే స్టోరీస్ లో మార్పులు చేర్పులు సూశించలేడట. అదే బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో అయితే, ఏ దర్శకుడు అయినా కథ తీసుకుని వెళితే, ఆ హీరో ఖచ్చితంగా స్టోరీ మార్చాల్సిందే అంటాడు అట.

పైగా హీరో వాళ్ల తండ్రి రంగంలోకి దిగి స్టోరీని రీరైట్ చేయమని ఆదేశిస్తాడట. అంతే కాకుండా ఇద్దరు ముగ్గురు స్టోరీ రైటర్స్ ను రంగంలోకి దింపుతాడట. అసలు చిరంజీవి ఎక్కడి నుంచి వచ్చాడు? రవితేజ ఎక్కడికి నుంచి వచ్చాడు? నాని ఎక్కడి నుంచి వచ్చాడు? వీరందరూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగలేదా.. తమ దగ్గరికి వచ్చిన స్టోరీలు బాగున్నాయి, బాగోలేవు, మార్పులు , చేర్పులు చెప్పలేకపోయారా.. అని నెటిజెన్స్ ఓపెన్ గానే విజయ్ దేవరకొండ ను ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి

error: Content is protected !!