సీక్వెల్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ముందుగా గట్టి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా బాగుంటే, హిట్ వచ్చి ఖాతాలో పడుతుంది. లేదా తర్వాత సంగతి తర్వాత..  ముందైతే సీక్వెల్ ఎనౌన్స్ చేస్తే, ఇండస్ట్రీలో హడావుడి ఉంటుంది. ప్రస్తుతం శ్రీవిష్ణు అదే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ సింగిల్ సినిమాకు సీక్వెల్ ఎనౌన్స్ చేసాడు. ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ తీసుకురాబోతున్నాడు. రెండేళ్ల క్రితం రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన సామజవరగమన చిత్రం, శ్రీవిష్ణుకు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. తన కామెడీ టైమింగ్ సినిమాకు కాసుల వర్షాన్ని కురిపించింది. సరాసరి 50 కోట్ల క్లబ్ లోకి చేర్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకొచ్చే పనుల్లో ఉన్నాడు శ్రీ విష్ణు. మొదటి భాగం తీసిన రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేయబోతున్నాడు. కాకపోతే, ప్రస్తుతం రామ్, నారి నారి నడుమ మురారి తెరకెక్కిస్తున్నాడు. శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీటై, రిలీజైన తర్వాత సామజవరగమన సీక్వెల్  సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు శ్రీవిష్ణు కూడా తన చేతిలో ఉన్న రెండు చిత్రాలు పూర్తి చేస్తాడు.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!