సరిగ్గా రిలీజ్ కు ముందు అఖండ సీక్వెల్ విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇలాంటి సమస్యలతోనే పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం రిలీజ్ కు కొద్ది గంటల ముందు పరిస్థితులు గందరగోళంగా మారిన సంగతి కూడా తెలిసిందే. చివరి నిముషంలో పవన్ రంగంలోకి దిగి అంతా సెట్ చేసారు. హరిహర వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ కు లైన్ క్లియర్ చేసారు. ఇందుకు గాను పవన్ ఇతర నిర్మాతలకు దాదాపు 60 కోట్లు బాకీ పడినట్లు సమాచారం. వారి నుంచి మళ్లీ అడ్వాన్సులు తీసుకుని, హరిహరవీరమల్లు రిలీజ్ కు అడ్డంకులు తొలిగించారు పవన్.

ఏది అయితేనే పవన్ చేసిన పని నాడు, నేడు కూడా ప్రశంసలు దక్కించుకుంటున్నాయి. అయితే తన సినిమాకు ఇంతగా సాయం చేసిన పవన్ ను నిర్మాత ఏ.ఎం. రత్నం విస్మరించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హరి హర వీరమల్లు చిత్రం విడుదల తర్వాత కొద్ది రోజుల్లోనే రత్నం తమిళనాడు వెళ్లిపోయినట్లు, ప్రస్తుతం అక్కడే ఉంటున్నట్లు సమాచారం. పవన్ చేసిన సాయం గురించి, సినిమా రిలీజ్ కు పవన్ చూపిన చొరవ గురించి ఆయన గాని, ఆయన అబ్బాయ్ జ్యోతి కృష్ణ స్పందించకపోవడం, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హరిహర వీరమల్లు సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్లు దాటిపోయింది అనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చే మాట. వసూళ్లు మాత్రం వంద కోట్లు మేర వచ్చాయి. ఇందులో ఓపెనింగ్స్ రూపంలోనే 30 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.అది కూడా పవన్ చొరవ చూపించడంతో ఈ సినిమా కు బ్రహ్మాండమైన ప్రీమియర్స్ పడ్డాయి. అందుకే ఈ స్థాయి ఓపెనింగ్స్ సాధ్యపడ్డాయి. ఇక పవన్ కూడా తన రెమ్యూనరేషన్ ను తిరిగి ఇచ్చేసారు. ఓటీటీ, శాటీలైట్, ఓవర్సీస్, డిజిటల్ రూపంలో బాగానే వ్యాపారం జరిగింది. అయినప్పటికి రత్నం మాత్రం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ కావడం విచిత్రంగా ఉంది అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు రెడీ అవుతున్నారు. మార్చిలో మూవీ రిలీజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!