త్రివిక్రమ్ మాటలకు, త్రివిక్రమ్ సినిమాలకు, త్రివిక్రమ్ టైటిల్స్ కు  తెలుగు నాట చాలా క్రేజ్ ఉంది. త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాస్తే .. ఫిదా, త్రివిక్రమ్ తన చిత్రాలకు పెట్టే టైటిల్స్ అయితే ఇక నెక్ట్స్ లెవల్. అరవిందసమేత, అల వైకుంఠపురములో, ఇలాంటి టైటిల్స్ చూసి సందీప్ వంగా లాంటి మేకర్ కూడా షాక్ అయ్యాడు. బాబోయ్ ఇలాంటి టైటిల్స్ పెట్టడం త్రివిక్రమ్ వల్లే సాధ్యం అన్నాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు కొత్త చిత్రానికి పెట్టిన పేరు ఏంటో తెలుసా ఆదర్శ కుటుంబం.

ఇందులో ఏం కొత్తదనం ఉంది గురూజీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీస్థాయికి తగ్గ టైటిల్  పెట్టాల్సిందిగా నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు. వెంకటేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కోసం, ఏళ్లుగా సినీ పరిశ్రమ ఎదురు చూసింది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా వర్క్ చేసాడు. ఈ రెండు సినిమాల్లో వెంకీ కామెడీ టైమింగ్ అదిరింది. ఒక క్లాసిక్ స్టేటస్ అందుకున్నాయి అంటే అందుకు త్రివిక్రమ్ మెయిన్ రీజన్. అలాంటి కాంబినేషన్ లో సినిమా, కాని ఇంత సింపుల్ టైటిల్ పెట్టారేంటి అని డిజప్పాయింట్ అయ్యారు త్రివిక్రమ్ ఫ్యాన్స్.

అయితే ఇదంతా గుంటూరు కారం వల్లే  అంటున్నారు త్రివిక్రమ్ సన్నిహితులు. గుంటూరు కారం చిత్రంతో త్రివిక్రమ్ మాస్ డైరెక్టర్ గా మారాలి అనుకున్నాడు. కాని ఆడియెన్స్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. దీంతో మాటల మాంత్రికుడు తప్పక యూటర్న్ తీసుకున్నాడు అంటున్నారు. వచ్చే వేసవిలో ఆదర్శకుటుంబం రిలీజ్ కానుంది. ఆదర్శ దంపతులుగా వెంకటేష్, శ్రీనిధిశెట్టి నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!