
మామూలుగా అయితే త్రివిక్రమ్ సీక్వెల్స్ జోలికి పోడు, ఒక కథను ఒకే సారితో పూర్తి చేస్తాడు. సింగిల్ పార్ట్ లో సినిమాను కంప్లీట్ చేస్తాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇది అధికారిక సీక్వెల్ కాదు. సీక్వెల్ అని చెప్పకుండా, గతంలో తాను తీసిన ఓ సూపర్ హిట్ మూవీ లైన్‌కి దగ్గరిగా తెరకెక్కుతుందట. అది ఎలా అంటే ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఆదర్శకుటుంబం చిత్రం ఉంది కదా.. ఈ సినిమా గతంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ లాగే ఉంటుందట.
అంటే వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు సీక్వెల్ అనుకుంటే మీరు పొరబడినట్లే, ఎందుకంటే, అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించిన జులాయి గుర్తుందా.. సేమ్ టు సేమ్ అదే లైన్ లో ఆదర్శకుటుంబం స్టోరీలైన్ ఉండబోతోందట. జులాయిలో కనిపించిన ఫన్, అల్లు అర్జున్ నడిపించిన మైండ్ గేమ్, ఆదర్శ కుటుంబంలోనూ రిపీట్ అవుకతుందట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి యానిమల్ ఫేమ్ హర్ష వర్దన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వేసవి కానుకగా థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు.
ఇది కూడా చదవండి
