ధనుష్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ గురించి తెల్సిందే. ఎక్కడ తన కోసం క్యారెక్టర్ క్రియేట్ చేసినా,ఆ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి నటిస్తాడు. కోలీవుడ్ తో మొదలై, టాలీవుడ్, బాలీవుడ్, లో సినిమాలు చేసోన్న ధనుష్,కొంత కాలంగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లోనూ కనిపిస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి అతని హాలీవుడ్ జర్నీ నెక్ట్స్ లెవల్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అదెలా అంటే, గతంలో నెట్ ఫ్లిక్స్ లో కోసం గ్రేమ్యాన్ అనే యాక్షన్ ఫిల్మ్ లో నటించాడు ధనుష్.ఈ నెట్ ఫ్లిక్స్ మూవీని తెరకెక్కించింది ఎవరో కాదు, అవెంజర్స్ ఎండ్ గేమ్ తీసిన దర్శకులు రుస్సో బ్రదర్స్.కొంత కాలంగా వీరితో పాటు జర్నీ చేస్తున్నాడు ధనుష్. ఇటీవలే రుస్సో బ్రదర్స్ మార్వెల్ కంపెనీకి తిరిగొచ్చారు. త్వరలోనే డూమ్స్ డే పేరుతో తెరకెక్కే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అందులో విలన్ గా ఒకప్పటి ఐరన్ మ్యాన్, రాబర్ట్ డౌనీ జూనియర్.ఎన్నో ఏళ్ల పాటు మార్వెల్ సినిమాలకు బ్యాక్ బోన్ గా నిలిచిన అరుదైన సూపర్ మ్యాన్ ఈయన. అవెంజర్స్ ఎండ్ గేమ్ లో, థానోస్ తో పోరాడుతూ తనవు చాలించాడు. ఇప్పుడు విలన్ గా మార్వెల్ ప్రపంచంలోకి తిరిగి అడుగు పెడుతున్నాడు.డూమ్స్ డే, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ లో విలన్ రోల్ చేయబోతున్నాడు. ఇతని టీమ్ లో లేదా మార్వెల్స్ కు సపోర్ట్ చేస్తూనే,ధనుష్ కోసం రుస్సో బ్రదర్స్ రోల్ క్రియేట్ చేసారని హాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం,తమిళ సినీ పరిశ్రమకు అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.

error: Content is protected !!