అక్కినేని అన్నదమ్ములు అంటే అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్. వీరిద్దరు ఏం చేసినా, జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా,అది తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. గతంలో సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగ చైతన్య. సరిగ్గా వీరి మ్యారేజ్ కు ముందు అఖిల్ బాబు బయటికి వచ్చి శ్రేయా భూపాల్ తో లవ్ అంటూ ఎంగేజ్ మెంట్ పిక్స్ బయటికి వదిలాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెల్సిందేగా,ఎంత స్పీడ్ గా ఎంగేజ్ మెంట్ అయిందో,అంతే స్పీడ్ గా వీరిద్దరికి బ్రేకప్ కూడా అయింది.
ఇప్పుడు మరోసారి హిస్టరీని రిపీట్ చేసారు అక్కినేని అన్నదమ్ములు. శోభితాతో పెళ్లికి రెడీ అవుతున్నాడు నాగ చైతన్య. డిసెంబర్ 4న వీరి ఇరువురి వివాహం ఘనంగా జరగనుంది. ఇంతలో అఖిల్ బాబు మళ్లీ బయటికి వచ్చాడు. ఈసారి మళ్లీ ఎంగేజ్ మెంట్ పిక్స్ బయటికి వదిలాడు. జైనబ్ తో కొంత కాలంగా ప్రేమలో ఉన్నాడట అఖిల్. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్ మెంట్ రోజునే లవ్ స్టోరీ రివీల్ చేసాడు.
అన్న పెళ్లి అన్నప్పుడే తమ్ముడు ఎంగేజ్ మెంట్ అని చెప్పడం ఒకసారి అనుకోకుండా జరిగింది అంటే అనుకోవచ్చు. కాని సేమ్ ఎపిసోడ్ రెండో సారి రిపీట్ కావడం అంతా విడ్డూరంగా ఉంది. రెండు సార్లు నాగ చైతన్య హీరోయిన్ తోనే లవ్ లో పడ్డాడు. రెండు సార్లు అఖిల్ బిజినెస్ మెన్ డాటర్స్ తోనే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.