
ఎలాగూ కింగ్ నాగార్జున మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ కుబేరలో ధనుష్ తోనూ, ఆ తర్వాత కూలీలో రజనీకాంత్ మూవీలోనూ, నటిస్తున్నాడు. కుబేర ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక కూలీ ఆగస్ట్ 14న విడుదల అవుతోంది. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో, నాగార్జున కొత్త చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. కెరీర్ లో వందో చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తాడని ప్రచారం సాగుతోంది. ఒక తమిళ యువ దర్శకుడు నాగార్జున సెంచరీ మూవీని తెరకెక్కిస్తాడట. ఈ సంగతి ఇలా ఉంటే, ఇప్పుడు నాగార్జున మరో మల్టీస్టారర్ కమిట్ అయ్యాడట. ఈసారి మరో యంగ్ హీరో మూవీలో కాసేపు కనిపిస్తానని డేట్స్ ఇచ్చాడట. ఆ యువ హీరో ఎవరో కాదు. అక్కినేని అఖిల్.
అఖిల్ నటిస్తోన్న లెనిన్ మూవీలో నాగార్జున కొద్ది నిముషాలు కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ డెబ్యూ మూవీలో నాగార్జున కొద్ది నిముషాలు పాటు కనిపించిన సంగతి తెలిసిందే. కాని లెనిన్ లో మాత్రం పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నాడు. నాగార్జున, అఖిల్ మల్టీస్టారర్ ఖరారు అయితే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కు పండగే.
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి