ప్రైడ్ తెలుగు న్యూస్ – ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. పవన్ వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ తో కూడా భాదపడుతున్నారట. వైద్యుల సూచనతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది. గురువారం జరిగే కేబినేట్ భేటికి కూడా పవన్ హాజరు కాకపోవచ్చు అని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారని తెలిసి జనసైనికులు, అభిమానులు చలించిపోయారు. పవర్ స్టార్ త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ స్పాండిలైటిస్ అంటే ఏంటి అంటే, మెడ దగ్గర వెన్నుముక భాగంలో డిస్కుల మధ్య నరాలు ఉంటాయి.  ఈ నరాల మధ్య ఒత్తిడి పటడం వల్ల, మెడనొప్పి, నడుం నొప్పి వస్తుంటుంది. తల తిరగడం, వాంతులు , వికారం, మానసికంగా ఉత్సాహం లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

ప్రస్తుతం పవన్ మందులు వాడుతున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.కాబట్టి అభిమానులు భయపడాల్సిన పనిలేదు. మరికొద్ది గంట్లలోనే పవన్ ఉత్సాహంగా తిరిగి ప్రజల ముందుకు వస్తారు.

ఇవి కూడా చవవండి
error: Content is protected !!