మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న కొత్త చిత్రం విశ్వంభర పై, తెలుగు సినీ పరిశ్రమలో చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు, నేటి వర్షన్ గా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ విదేశాల్లో జరుగుతోంది.  సినిమా మొత్తం కూడా గ్రాఫిక్స్ మీదే ఆధారపడటంతో, చిత్రయూనిట్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. అందుకే, రిలీజ్ డేట్ లాక్ చేయడం లేదు. ఒక్కసారి అవుట్ పుట్ పై నమ్మకంగా ఉంటే, విడుదల తేదీని ప్రకటిస్తారు.

అయితే చిరు రీసెంట్ గా సినిమాకు సంబంధించిన 45 నిముషాల ఫూటేజీని చూసి, బాగా వచ్చిందని చిత్ర యూనిట్ ను అభినందించారట. త్వరలోనే పూర్తి సినిమా అవుట్ పుట్ రెడీ అవుతుందట. ఈలోపు సినిమాలో బ్యాలెన్స్ ఉన్న ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తారట. ఈ ఒక్క పాటను భీమ్స్ కంపోజ్ చేయబోతున్నాడు.

అయితే ఈ సాంగ్ గతంలో అన్నయ్య లో వినిపించిన ఆట కావాలా, పాట కావాలా రీమిక్స్ కాదని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. చిరు కోసం భీమ్స్ ఒక కొత్త ట్యూన్ రెడీ చేస్తున్నాడట. ఇక ఈ సాంగ్ లో చిరుతో స్టెప్పులేయడానికి బాలీవుడ్ నుంచి మౌనీ రాయ్ వస్తోంది. ఇదే ఏడాది విశ్వంభర ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బింబిసార ఫేమ్ వశిష్ట మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. త్రిష ఒక కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి

error: Content is protected !!