అసలే తమ్ముడు అంటే ప్రాణం. పైగా తాను అందుకోలేకపోయిన లక్ష్యాలను సైతం, తాను అందుకుంటున్నాడు. తన తమ్ముడిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం, ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించడం, అన్నిటికి మంచి, ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై పవన్ కల్యాణ్ తిరిగొస్తుండటంతో, మెగా ఆనందం అంతా ఇంతా కాదు. హరిహార వీరమల్లు ట్రైలర్ రిలీజైన కొద్ది సేపటికే, చిరు ట్రైలర్ చూడటం, తన రివ్యూను సోషల్ మీడియాలో రాసుకురావడం, చూసేవారికి రెండు కళ్లు సరిపోలేదు. మెగా బ్రదర్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని వారు వంద దేవుళ్లకు మొక్కుకున్నారు. ట్రైలర్ చాలా ఎలక్ట్రిఫైయింగ్ ఉంది, రెండేళ్ల తర్వాత కల్యాణ్ బాబు రీఎంట్రీకి థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. ఆల్ ది బెస్ట్ అంటూ చిరు పోస్ట్ పెట్టారు.

ఇది కూడా చదవండి

error: Content is protected !!