
పుష్ప -2 రిలీజైనప్పటి నుంచి, ఈ సినిమా కొల్లగొట్టిన వసూళ్ల గురించి, బద్దలవుతున్న రికార్డుల గురించే అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. అందులో భాగంగా 32 రోజుల్లోనే బాహుబలి -2 రికార్డ్ ను క్రాస్ చేసింది పుష్ప-2 మూవీ. ఆ రోజు 1800 కోట్లకు పైగా ఉన్న వసూళ్ల పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
కాని వన్స్ ఈ పోస్టర్ రిలీజైన తర్వాత చిత్ర యూనిట్ సైలెంట్ అయిపోయింది.మధ్యలో మరో 20 నిముషాలు కొత్త సీన్స్ యాడ్ చేసి, పుష్ప -2 రీలోడెడ్ వర్షన్ ను థియేటర్స్ కు తీసుకొచ్చింది. ఈ వర్షన్ కూడా బాగుందని చాలా మంది చెప్పారు. కాని ఎంత కలెక్ట్ చేసింది అని మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ చెప్పలేకపోయారు. మరోవైపు ఇదే సమయంలో జరిగిన ఐటీ దాడులు కూడా వసూళ్ల వివరాలు బయటపెట్టకపోవడానికి మరో కారణంగా చెప్పుకొవచ్చు. అసలు చెప్పిన వసూళ్లే కరెక్ట్ కాదనే వాదన కూడా ఉంది.ఏది ఏమైనా రెండు వేల కోట్లతో టాప్ ప్లేస్ లో ఉన్న దంగల్ రికార్డ్ ను మాత్రం పుష్ప -2 బీట్ చేయలేకపోయందనే చెప్పాలి.
అయితే ఈ చిత్రాన్ని భవిష్యత్ లో చైనా, జపాన్ లాంటి మార్కెట్స్ లో రిలీజ్ చేసిన తర్వాత,అక్కడి ప్రేక్షకుల స్పందన బాగుంటే మాత్రం దంగల్ రికార్డ్ ఇట్టే బద్దలవుతుంది. లేదా ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో హిందీ చిత్రం దంగల్ మాత్రమే ఉంటుంది. సెకండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఇప్పటి వరకు బాహుబలి 2 ఉంది. దాన్ని పుష్ప సీక్వెల్ క్రాస్ చేసి రెండవ స్థానంలో నిలిచింది అని చెప్పవచ్చు.
