దిల్ రాజు తన బ్యానర్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాలి అని, ఎంతో ప్లాన్డ్ గా, శంకర్ మేకింగ్ లో గేమ్ ఛేంజర్ ను ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ మూవీ కావడంతో, భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఈ సినిమా ఎక్కడా కూడా ఆ స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది. పైగా శంకర్ ఇమేజ్ కు భారీ స్థాయిలో డ్యామేజీ జరిగింది. నిర్మాతగా దిల్ రాజు, సర్వం కోల్పోవాల్సి వచ్చింది. సేమ్ టైమ్ ఇదే బ్యానర్ నుంచి అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం రిలీజై బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే దిల్ రాజు పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత శిరీష్ కన్ ఫామ్ చేసాడు.

అయితే,దిల్ రాజు మాత్రం తమ బ్యానర్ లో మరోసారి రామ్ చరణ్ చిత్రం చేయబోతున్నాడని,
అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని, ఈసారి చరణ్ తో గ్రౌండ్ బ్రేకింగ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్ అంటే మాత్రం రివీల్ చేయడం లేదు. అయితే దిల్ రాజు దగ్గర ప్రశాంత్ నీల్ డేట్స్ ఉన్నాయి. అది ప్రభాస్ కోసం దిల్ రాజు తీసుకున్న డేట్స్. ఇప్పుడు అవే డేట్స్ ను రామ్ చరణ్ కోసం ఉపయోగించాలి అనుకుంటున్నాడేమో దిల్ రాజు.

ప్రభాస్ తో సలార్ కాకుండా, మరో కథతో సినిమా చేసేందుకు ప్రశాంత్ నీల్, దిల్ రాజు దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఇతర ప్యాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉండటంతో ఇదే ప్రాజెక్ట్ ను చరణ్ తో ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది దిల్ రాజు.

రామ్ చరణ్ కు గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ ఇచ్చినందుకు కొంత రిగ్రెట్ ఫీలవతున్నాడు దిల్ రాజు.\ ఈ లోటును తీర్చుకునేందుకు , రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్ హిట్ ఇవ్వలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం నితిన్ హీరోగా తమ్ముడు అనే చిత్రాన్ని ఈ వారమే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు దిల్ రాజు.

ఇది కూడా చదవండి

error: Content is protected !!