జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలోని మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకలు మృతిచెందడం దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. 2019 పుల్వామా ఘటన తర్వాత లోయలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. ఈ ఊచకోతకు పాల్పడింది తామేనని రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పాక్ కేంద్రంగా లష్కర్  ఎ తొయిబాకు అనుబంధంగా కొనసాగే ఉగ్రవాద సంస్థ ఇది.  కశ్మీర్ లో పర్యాటకాన్ని, తద్వారా వస్తోన్న ఆదాయాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ  దాడికి తెగబడినట్లు తెలుస్తోంది.

కశ్మీర్ లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ఐదు లక్షలకు పెరిగిన పర్యాటకులు, ఇలా కశ్మీర్ గత మూడు దశాబ్ధాల కాలంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో ఉగ్ర సంస్థలకు కంటి మీద కనుకు కరవవుతోంది. ముఖ్యంగా పర్యాటకం దెబ్బ తీయాలని ఉగ్రవాదులు , పహల్గాంలో దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే గాడినపడుతున్న కశ్మీర్ లో మళ్లీ అగ్గిరాజేసేందుకు పక్క దేశం ఉగ్ర మూకలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లో శాంతిని కాపాడటానికి ఏం చేయబోతుంది అనేది మరి కొద్ది రోజుల్లోనే తెలియనుంది.

error: Content is protected !!