సరిగ్గా వారం క్రితం నాటి మాట, అప్పటికి వీరమల్లుకు అస్సలు క్రేజ్ లేదు. అంతకు ముందు రిలీజైన ట్రైలర్ కాస్త ఇంప్రెసివ్ గా కనిపించింది. ఐదేళ్లు నిర్మాణంలో ఉండటం, సాంగ్స్ క్లిక్ కాకపోవడం, పేరున్న దర్శకుడు తెరకెక్కించకపోవడం, పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండటంతో, వీరమల్లు అడ్వాన్స్ బుకింగ్ కూడా ఆశించినంతలేదు. ఇక సినిమా బిజినెస్ సంగతి అంటారా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాని వన్స్ పవన్ బయటికి వచ్చి ప్రమోషన్ స్టార్ట్ చేసాడో, హైదరాబాద్ , వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించాడో, ఈ సినిమాకు క్రేజ్ పీక్స్ కు చేరింది. దీంతో వీర మల్లు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రీమియర్ షోస్ , ఫస్ట్ డే టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి. వరల్డ్ వైడ్ గా పవన్ సినిమా హరిహర వీరమల్లు మేనియా కనిపించింది. దీంతో సహజంగానే, తొలిరోజు వసూళ్లు ఎంత అనే చర్చ మొదలవుతుంది.

హరిహార వీరమల్లు తొలి రోజు వసూళ్లు దాదాపు 70 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే పెట్టిన పెట్టుబడిలో 30 శాతం రికవరీ అయింది అనమాట. వారం క్రితం బజ్ లేని సినిమాకు, పవన్ ఎంట్రీతో క్రేజ్ రావడం, తొలిరోజే 70 కోట్ల వసూళ్లు కురవడం చిన్న విషయం కాదు. పవన్ కల్యాణ్ లాంటి ఎవర్ గ్రీన్ అల్టీమేట్ స్టార్ కు మాత్రమే ఇలాంటి రికార్డులు కొట్టడం సాధ్యం అని చెప్పవచ్చు. ఇక రెండవ రోజు కలెక్షన్స్ లో కొంత డ్రాప్ ఉంది. శుక్రవారం వర్కింగ్ డే కావడం, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. శని, ఆదివారాల్లో మళ్లీ కలెక్షన్స్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు పవన్ అప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీ కాబోతున్నాడు. శనివారం నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైన ఆఖరి షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. వారం , పది రోజులతో ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి అవుతుంది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!