
హరిహర వీరమల్లు, ట్రైలర్ రిలీజ్ కు ముందు వరకు, క్రేజ్ లేదు. బజ్ లేదు. హంగామా లేదు. బిజినెస్ లేదు. పోయింది అట కదా. సినిమాలో ఏం లేదు అట కదా. ఇలాంటి మాటలు వినీ వినీ ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. వన్స్ ట్రైలర్ రిలీజైంది. ఇప్పుడు రైట్స్ కోసం ఎగబడి పోతున్నారు ఎగ్జిబీటర్లు, డిస్ట్రీబ్యూటర్లు. అదేం ట్రైలర్ అబ్బా, మైండ్ లో నుంచి పోవడం లేదు అంటున్నారు..
మరో వైపు సోషల్ మీడియాలోనూ, బయట హరి హర వీరమల్లు ట్రైలర్ ను ప్రదర్శించిన హాల్స్ దగ్గర పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా చూసి, టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా నివ్వెరపోయింది. చాలా కాలంగా టాలీవుడ్ ఈ తరహా క్రేజ్ ను మిస్ అయింది. అయితే ట్రైలర్ కే ఫ్యాన్స్ ఇలా ఉంటే, రేపు జులై 24న సినిమా రిలీజ్ రోజున పవర్ స్టార్ ఫ్యాన్స్ కంట్రోల్ చేయగలమా అనే బెంగ ఇప్పుడు పరిశ్రమలో మొదలైంది.
సాధారణంగా పవన్ కల్యాణ్ పెద్దగా పట్టించుకోడు. కాని వన్స్ రంగంలోకి దిగాడు అంటే అంతు చూసేవరకు వదిలి పెట్టడు. అది సినిమాలు అయినా రాజకీయాలైనా, తనతో పాన్ ఇండియా సినిమా తీస్తాను అంటూ ఏళ్లు ఏళ్లు ఎదురు చూసి, మళ్లీ నిర్మాణం కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూసి,
ఎట్టకేలకు ఈ రోజు ట్రైలర్ రిలీజ్ వరకు వచ్చిన ఏ.ఎం.రత్నం కోసం పవన్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తనను నమ్మిన వ్యక్తి నష్టపోకూడదు అని పవన్ ఈ సినిమా కోసం చేయాల్సిందంతా చేసాడు. పాట పాడాడు, రిస్కీ స్టంట్స్ చేసాడు,లెక్కనేనన్ని షూటింగ్ డేస్ ఇచ్చాడు. ఆఖరికి సినిమాను పూర్తి చేసాడు. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ రత్నంగారి అంచనాలు అందుకునే విధంగా అహర్నిసలు పవన్ తాపత్రయపడ్డాడు. అందుకే రంగంలోకి త్రివిక్రమ్ ను దింపాడు.
ఆయన కూడా గత కొద్ది నెలలుగా ఈ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేయడంలో తన చేయి కూడా వేసాడు. ఏది ఏమైనా బ్రో తర్వాత రెండేళ్లకు పవర్ స్టార్ బిగి స్క్రీన్ పై తిరిగొస్తున్నాడు. పైగా పవర్ ఫుల్ ట్రైలర్ … రాబోయే బాక్సాఫీస్ సంచలనాలకు నాందిగా మారింది.
ఇది కూడా చదవండి