టైటిల్ చూసి ఇది పాలిటక్స్ కు సంబంధించి అస్సలే అనుకోకుండి, ఎందుకంటే ఇదంతా కూడా సినిమాకు సంబంధించిన న్యూస్. అసలు విషయానికి వస్తే సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ ఎన్ని సినిమాల్లో నటిస్తున్నప్పటికీ, ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తైంది. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. అదే సెప్టెంబర్ 25.

అయితే ఇప్పుడు ఇదే డేట్ కు చిరు నటిస్తోన్న విశ్వంభర విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటోంది ఇండస్ట్రీ. సెప్టెంబర్ 25నే ఎందుకంటే ఆ తర్వాత దసరా సీజన్ ఉంది. సెలవులు కలిసొస్తాయి. అయితే ఇది జరగాలి అంటే ముందు విశ్వంభర గ్రాఫిక్స్ చూసి చిరు ఓకే అనాలి, అప్పుడు ఓజీ తప్పుకుంటాడు. విశ్వంభర వస్తాడు. లేదా గ్రాఫిక్స్ వర్క్ పై చిరు ఏమాత్రం సాటిస్ ఫాక్షన్ లేకపోయినా, ఓజీ సేమ్ డేట్ కు వచ్చేస్తుంది. విశ్వంభర సమ్మర్ కు వాయిదా పడుతుంది.లేదు సెప్టెంబర్ 25న విశ్వంభర వస్తే మాత్రం, సమ్మర్ కు ఓజీ పోస్ట్ పోన్ అవుతుంది.

ఓజీకి సుజిత్ దర్శకుడు. అతను కట్ చేసిన టీజర్ వల్లే, ఈ సినిమాకు ఇంత క్రేజ్. ఇక విశ్వంభర సంగతి తెలిసిందే. బింబిసార దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఫ్యాంటసీ మూవీ. చిరు అభిమానులను మళ్లీ మళ్లీ జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి రోజుల్లో తీసుకెళ్లేందుకు దర్శకుడు వశిష్ట ప్రయత్నిస్తున్నాడు. అందుకు సంబంధించి గ్రాఫిక్స్ ఆలస్యం అవుతోంది.

ఇది కూడా చదవండి

error: Content is protected !!