ప్రైడ్ తెలుగు న్యూస్ – సినిమా – హీరోయిన్ బయోగ్రఫీ – వైష్ణవి చైతన్య

టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే, ఏ ముంబై నుంచో, కన్నడం నుంచి దర్శకనిర్మాతలు తీసుకొస్తుంటారు. కాని ఇప్పుడు రోజులు మారిపోయాయి. తెలుగు హీరోయిన్లు, తెలుగు తెరపై కనిపిస్తున్నారు. ముఖ్యంగా బేబీ బ్యూటీ ఉంది కదా వైష్ణవి చైతన్య, ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ లేడీగా ఎదిగే ప్రయత్నంలో ఉంది.

హీరోయిన్ గా నటించిన బేబీ, వైష్ణవికి ఇమిడియెట్ గా బ్లాక్ బస్టర్ అందించింది. బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల బిజినెస్ ను అందించింది. ప్రస్తుతం వైష్ణవి డీజే టిల్లు నటిస్తోన్న కొత్త సినిమా జాక్ లో , అతనికి జోడిగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ పై, టాలీవుడ్ లో చాలా అంచనాలు ఉన్నాయి.

తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన విష్ణవి, అసలు పుట్టింది ఎక్కడో తెలుసా.. విజయవాడలో, అయితే పెరిగింది మాత్రం హైదరాబాద్ లో, చదవింది కూడా హైదరాబాద్ లోనే… ఆ మధ్య బాగా పాపులర్ అయిన డబ్ స్మాష్, టిక్ టాక్ లో, బాగా వీడియోస్ చేసి, సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసి కవర్ వీడియోస్ చేసి , సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఇక షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం మొదలు పెట్టిన తర్వాత, వైష్ణవి దశ మారిపోయింది. యూత్ కు బాగా కనెక్ట్ అయింది.

యూట్యూబ్ వెబ్ సిరీస్ లు అయిన సాఫ్ట్ వేర్ డెవలపర్, అరే అరే మనసా, మిస్సమ్మ, లవ్ ఇన్ 143 అవర్స్, లాంటివి నటిగా వైష్ణవికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఇక్కడితో జర్నీని ఆపకుండా,సినిమాల్లో అవకాశాలు రావడం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టచ్ చేసి చూడు, ఈ మాయ పేరేమిటో, అల వైకుంఠపురములో, రంగ్ దే, టక్ జగదీష్, వరుడు కావలెను, తమిళ చిత్రం వాలిమై, లాంటి సినిమాల్లో సహాయ నటిగా కనిపించింది.

2023లో సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన బేబీతో హీరోయిన్ గా మారింది. వైషూ పాత్రలో తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఆ తర్వాత ఏడాది లవ్ మీ అనే సినిమా చేసినప్పటికీ పెద్దగా కలసి రాలేదు. ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డతో కలసి జాక్ అనే మూవీ చేస్తోంది.
ఏప్రిల్ 10న ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

బేబీలో మాస్ లుక్ లో , మాస్ రోల్ చేసినప్పటికీ, వైష్ణవీ పక్కా ట్రెడీషనల్. అందుకే ఎక్కువగా శారీస్ లో కనిపిస్తుంటుంది. చిన్నప్పుడు గణేష్ మండపం ఎదురుగా వేసిన డ్యాన్స్, బేబీలో సాయి రాజేష్ రిపీట్ చేసాడు. దాంతో సినిమాలో ఇదో హైలైట్ గా నిలిచింది.

error: Content is protected !!